జేఈఈ నిబంధనపై ఫిర్యాదు చేసుకోవచ్చు

తాజా వార్తలు

Published : 16/09/2021 21:42 IST

జేఈఈ నిబంధనపై ఫిర్యాదు చేసుకోవచ్చు

విద్యార్థులకు సుప్రీంకోర్టు సూచన

దిల్లీ: జేఈఈ (అడ్వాన్స్‌డ్‌)-2021 ప్రవేశ నిబంధనల్లో అభ్యంతరం ఉన్న అంశంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు విద్యార్థులకు సూచించింది. 12వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన రెండేళ్లలోపు మాత్రమే జేఈఈ (అడ్వాన్స్‌డ్‌)కు అర్హులంటూ నిబంధన విధించడం సరికాదంటూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గరిష్ఠ వయసును 25 ఏళ్లుగా నిర్ణయించి, మళ్లీ ఎందుకు ఈ నిబంధన పెట్టారని ప్రశ్నించారు. అయితే తొలుత జాయింట్‌ అడ్మిషన్‌ బోర్డు ఛైర్మన్, జేఈఈ (అడ్వాన్స్‌డ్‌) కార్యాలయం, ఐఐటీ-ఖరగ్‌పుర్‌లకు ఫిర్యాదు చేయకుండా నేరుగా వచ్చినట్టు కనిపిస్తోందని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. విద్యార్థులు ఇచ్చే వినతి పత్రాలపై త్వరగా స్పందించి దరఖాస్తుల సమర్పణకు గడువు ముగిసేలోగానే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ నిబంధన కారణంగా దరఖాస్తు చేసేందుకు తమకు అవకాశం రాకుండా పోయిందని 2018-19లో ఉత్తీర్ణులయిన అయిదుగురు విద్యార్థులు ఈ దావా వేశారు. తాము జేఈఈ (మెయిన్స్‌) పాసయ్యామని, కానీ ఆ నిబంధన కారణంగా అడ్వాన్స్‌డ్‌-2021 రాయడానికి అవకాశం లేకుండా పోయిందంటూ న్యాయవాది సుమంత్‌ నూకల ద్వారా వ్యాజ్యాన్ని సమర్పించారు. మూడో ప్రయత్నంలో మెయిన్స్‌లో ఉత్తీర్ణులయ్యామని, అందువల్ల అడ్వాన్స్‌డ్‌లోనూ అవకాశం కల్పించాలని కోరారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని