భారత ముస్లింలలో అధిక సంతానోత్పత్తి రేటు

తాజా వార్తలు

Published : 22/09/2021 12:42 IST

భారత ముస్లింలలో అధిక సంతానోత్పత్తి రేటు

అమెరికన్‌ నివేదిక వెల్లడి

వాషింగ్టన్‌: భిన్న మతాలున్న భారతదేశంలో ముస్లిం వర్గంలోని సంతానోత్పత్తి రేటు ఇప్పటికీ అధికంగా ఉంటోంది. హిందువులు ద్వితీయస్థానంలో ఉండగా.. జైనులు అతితక్కువ సంతానోత్పత్తి రేటు కలిగి ఉన్నారు. అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ మంగళవారం ఓ నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. దేశంలోని హిందు, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు.. ఇలా అన్ని మతాల సంతానోత్పత్తి రేటు తగ్గుతున్నట్లు పేర్కొంది. భారత్‌లో మతాల కూర్పుపై ఈ పరిశోధన కేంద్రం నివేదించిన గణాంకాల మేరకు.. ముస్లిం మహిళల్లో 1992 నాటికి 4.4గా ఉన్న సంతానోత్పత్తి రేటు 2015 నాటికి 2.6 స్థాయికి దిగజారింది. హిందువుల్లో 3.3గా ఉన్న ఈ రేటు 2.1కి తగ్గింది. 1.2 సంతానోత్పత్తి రేటుతో జైనులు చివరిస్థానంలో ఉన్నారు. భారత్‌లో ఇద్దరు సంతానం పుట్టుక నడుమ గర్భధారణ వ్యవధి కూడా చాలా తక్కువగా ఉంటున్నట్లు నివేదిక తెలిపింది. మొత్తానికి సంతానోత్పత్తి రేటులో తేడాల కారణంగా భారత్‌లో ఇతర మతాల కంటే ముస్లింల జనాభా వేగంగా పెరుగుతున్నట్లు తేల్చింది. 2011 నాటి జనాభాగణన ప్రకారం 120 కోట్ల భారతీయుల్లో 79.8% హిందువులు ఉన్నారు. 2001 గణాంకాలతో పోల్చితే 0.7% తగ్గారు. ముస్లింల గణాంకాలు పరిశీలిస్తే.. 2001 నాటికి 13.4% ఉన్న వీరి జనాభా 2011కు 14.2 శాతానికి పెరిగింది. 1951 నుంచి పరిశీలిస్తే.. భారత్‌లో ముస్లిం జనాభా మొత్తం 4.4 శాతం మేర పెరిగింది. జనాభాపరంగా స్థిరంగా ఉన్న క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు మొత్తం జనాభాలో ఆరు శాతంలోపు ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని