Aryan khan: పేదల కోసం పనిచేస్తా.. చెడు మార్గంలో వెళ్లను: ఆర్యన్‌ఖాన్‌

తాజా వార్తలు

Published : 18/10/2021 01:30 IST

Aryan khan: పేదల కోసం పనిచేస్తా.. చెడు మార్గంలో వెళ్లను: ఆర్యన్‌ఖాన్‌

ఎన్‌సీబీ కౌన్సిలింగ్‌లో ఆర్యన్‌ ఖాన్‌  

ముంబయి: విడుదల అయిన తర్వాత పేదల సంక్షేమానికి కృషి చేస్తానని.. తనకు చెడ్డపేరు తెచ్చే  పనులు చేయబోనని, చెడు మార్గంలో వెళ్లనని బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ శనివారం ఎన్‌సీబీ అధికారులకు హామీ ఇచ్చాడు. ఈనెల 2న ఓ క్రూయిజ్‌ నౌకలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న కేసులో ఆర్యన్‌ను ఎన్‌సీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు ముంబయిలోని ఓ జైలులో అధికారులు అతనికి కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యన్‌ వివిధ అంశాలపై మాట్లాడినట్లు అధికారులు తెలిపారు. ‘‘పేదలు, అణగారిన వర్గాల ప్రజలకుచేయూతనిస్తా.. నన్ను చూసి గర్వపడేలా చేస్తా’’ అని అధికారులకు చెప్పాడు. కాగా అతని బెయిల్‌ వ్యాజ్యంపై ప్రత్యేక కోర్టు ఈనెల 20న ఆదేశాలు ఇవ్వనుంది. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని