Amarinder Singh: ఆమెతో ఉన్నోళ్లంతా ఐఎస్‌ఐ ఏజెంట్లా? 

తాజా వార్తలు

Updated : 26/10/2021 12:12 IST

Amarinder Singh: ఆమెతో ఉన్నోళ్లంతా ఐఎస్‌ఐ ఏజెంట్లా? 

సోనియా, సుష్మ తదితరులతో అరూసా ఫొటోలు 
విడుదల చేసిన అమరీందర్‌ సింగ్‌

చండీగఢ్‌: పాకిస్థానీ పాత్రికేయురాలు అరూసా ఆలంతో తన స్నేహంపై దుమారం చెలరేగుతుండటంతో పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ స్పందించారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర మాజీ మంత్రులు సుష్మా స్వరాజ్, యశ్వంత్‌ సిన్హా, ఉత్తర్‌ ప్రదేశ్‌ మాజీ సీఎం ములాయంసింగ్‌ యాదవ్, సినీ ప్రముఖులు శత్రుఘ్న సిన్హా, దిలీప్‌ కుమార్, మహేశ్‌ భట్‌ తదితరులతో అరూసా ఉన్న ఫొటోలను సోమవారం తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. ఫొటోల్లో ఆమెతో ఉన్నవారంతా పాక్‌ గూఢచర్య సంస్థ- ఐఎస్‌ఐ ఏజెంట్లేనా అని ప్రశ్నించారు. భారత్, పాకిస్థాన్‌ మధ్య ప్రస్తుతం వీసాల నిషేధం అమల్లో లేకపోయి ఉంటే తాను అరూసాను మళ్లీ మన దేశానికి ఆహ్వానించేవాడినని అమరీందర్‌ పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని