Vaccine: ఈ మూడు దేశాల్లోనే 60% వినియోగం
close

తాజా వార్తలు

Updated : 06/06/2021 11:09 IST

Vaccine: ఈ మూడు దేశాల్లోనే 60% వినియోగం

డబ్ల్యూహెచ్‌వో సీనియర్‌ సలహాదారు బ్రూస్‌ అయిల్వార్డ్‌

ఐరాస: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు పంపిణీ జరిగిన రెండు వందల కోట్ల కొవిడ్‌-19 టీకా డోసుల్లో సుమారు 60% డోసులు కేవలం అమెరికా, భారత్‌, చైనా దేశాల్లో మాత్రమే వేశారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సీనియర్‌ సలహాదారు ఒకరు తెలిపారు. ‘‘ఈ వారం మనం రెండు వందల కోట్ల డోసులను దాటేస్తాం. 212కుపైగా దేశాల్లో ఇప్పుడు టీకాల పంపిణీ జరుగుతోంది’’ అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ గేబ్రియేసస్‌కు సీనియర్‌ సలహాదారుగా ఉన్న బ్రూస్‌ అయిల్వార్డ్‌ వెల్లడించారు. ‘‘ఈ రెండు వందల కోట్ల డోసులను పరిశీలిస్తే.. 75 శాతానికిపైగా డోసులు కేవలం పది దేశాలకు అందాయి. అంతేకాదు 60 శాతానికిపైగా డోసులు కేవలం మూడు దేశాలకు (అమెరికా, చైనా, భారత్‌లకు) చేరాయి’’ అని వివరించారు. 127 దేశాలకు కొవిడ్‌-19 టీకా పంపిణీ, అనేక దేశాలు టీకా కార్యక్రమం ప్రారంభించడానికి కొవాక్స్‌ కీలక పాత్ర పోషిస్తోందని, టీకాల సేకరణే సవాలుగా ఉందని చెప్పారు. అమెరికా, చైనా, భారత్‌లు పొందిన 60% టీకాలు దేశీయంగా సేకరించి ఉపయోగించినవేనని ఆయన స్పష్టంచేశారు. ప్రపంచ జనాభాలో పది శాతం వాటా ఉన్న అల్పాదాయ దేశాలకు కేవలం 0.5 శాతం డోసులే అందాయని ఆవేదన వ్యక్తంచేశారు.

భారత్‌ ఇచ్చిన టీకాలు వేస్తున్నాం
ఐరాస శాంతి పరిరక్షక దళం సభ్యుల కోసం భారత్‌ అందజేసిన 2 లక్షల కొవిడ్‌-19 టీకా డోసులను ఉపయోగిస్తున్నామని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ప్రతినిధి స్టీఫెన్‌ డుజార్రిక్‌ తెలిపారు. ‘‘భారత ప్రభుత్వం రెండు లక్షల టీకా డోసులు అందజేసింది. అ మేరకు శాంతి పరిరక్షక దళం సభ్యులు టీకాలు పొందుతున్నారు’’ అని ఆయన వివరించారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని