Corona: గంగానదిలో అస్తికలు కలిపేందుకు ‘స్పీడ్‌ పోస్ట్‌’!
close

తాజా వార్తలు

Updated : 08/06/2021 06:52 IST

Corona: గంగానదిలో అస్తికలు కలిపేందుకు ‘స్పీడ్‌ పోస్ట్‌’!

కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో మరణించిన వారి అస్తికలను గంగానదిలో కలిపేందుకు పోస్టల్‌ శాఖ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా.. దేశంలో ఎక్కడి నుంచైనా అస్తికలు పంపితే.. వారణాసి, ప్రయాగ్‌రాజ్‌, హరిద్వార్‌, గయలోని గంగానదిలో కలిపేందుకు ఏర్పాట్లు చేసింది. మృతిచెందిన వారి అస్తికలను గంగానదిలో కలపడాన్ని హిందువులు పవిత్రమైనదిగా భావిస్తుంటారు. కరోనా ఆంక్షలతో అది క్లిష్టంగా మారింది. దీంతో పోస్టల్‌ శాఖ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.
పోర్టల్‌ ద్వారా..
వారణాసిలోని ఓమ్‌ దివ్య దర్శన్‌ అనే సామాజిక సేవా సంస్థ సంయుక్తంగా స్పీడ్‌ పోస్ట్‌ విధానాన్ని ప్రారంభించింది. దేశంలో ఎక్కడి నుంచైనా అస్తికలను స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా ఓమ్‌ దివ్య దర్శన్‌ కార్యాలయానికి పంపించవచ్చు. వీటిని సామాజిక సేవా సంస్థ  సిబ్బంది.. వారణాసి, ప్రయాగ్‌రాజ్‌, హరిద్వార్‌, గయలో నిమజ్జనం చేస్తారు. అయితే స్పీడ్‌ పోస్ట్‌ చేసేవారు ముందుగా ఓమ్‌ దివ్య దర్శన్‌ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకోవాలని వారణాసి పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ కృష్ణ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. ఓమ్‌ దివ్య దర్శన్‌ సేవాసంస్థ సభ్యులు.. శాస్తోక్త్రంగా అస్థికలను నిమజ్జనం చేస్తారని, అనంతరం ఓ సీసాలో గంగానది నీటిని కుటుంబ సభ్యులకు పోస్ట్‌ ద్వారా పంపిస్తారని వెల్లడించారు.

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని