డబ్బాలో చిన్నారిని పెట్టి నదిలో వదిలేశారు

తాజా వార్తలు

Updated : 17/06/2021 12:16 IST

డబ్బాలో చిన్నారిని పెట్టి నదిలో వదిలేశారు

యూపీలో పడవ యజమానికి దొరికిన 21 రోజుల పాప

ఈనాడు, లఖ్‌నవూ: 21 రోజుల వయసున్న ఓ పసికందును చెక్క డబ్బాలో పెట్టి గంగా నదిలో వదిలారు తల్లిదండ్రులు. పాప పేరు గంగ అని ఓ కాగితంపై రాసిపెట్టారు. దేవుళ్ల చిత్రాలతో పాటు చిన్నారి జాతకం వివరాలూ అందులో ఉంచారు. చివరకు ఆ పాప ఓ పడవ యజమానికి దొరికింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజీపుర్‌లో జరిగింది. గంగా నది దాద్రీ ఘాట్‌ సమీపంలో నీటిపై తేలుతున్న డబ్బాలో నుంచి చిన్నారి ఏడుపు వినిపించడంతో అక్కడున్న బోటు యజమాని మల్లాహ్‌ గుల్లు దాన్ని తెరిచి చూశాడు. పసికందును చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే చిన్నారిని ఇంటికి తీసుకెళ్లాడు. స్నానం చేయించి ఆహారం అందించాడు. ఆ పాపను తామే పెంచుకోవాలని గుల్లు దంపతులు ఆశపడ్డారు. అయితే చిన్నారి దొరికిన విషయం స్థానికుల ద్వారా పోలీసులకు తెలియడంతో కేసు నమోదు చేశారు. పాపను సంరక్షణ కేంద్రానికి తరలించారు. పాప తల్లిదండ్రుల వివరాలను తెలుసుకోవడానికి  రాష్ట్ర బాలల సంక్షేమ మండలి ఆదేశించింది. చిన్నారి సంరక్షణను ప్రభుత్వమే చూసుకుంటుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని