SMA: ఏడాది చిన్నారి ఊపిరి నిలిపిన అదృష్టం

తాజా వార్తలు

Updated : 28/06/2021 06:47 IST

SMA: ఏడాది చిన్నారి ఊపిరి నిలిపిన అదృష్టం

లక్కీ డ్రాలో ఉచితంగా దక్కినరూ.16 కోట్ల ఔషధం

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: ఎస్‌ఎమ్‌ఏ (స్పైనల్‌ మస్క్యులర్‌ ఆట్రోఫీ) వ్యాధి ఇప్పటికే ఆ దంపతులకు ఓ బిడ్డను దూరం చేసింది. ఇప్పుడు ఏడాది వయసున్న కుమార్తె జుహా జైనాబ్‌ అదే వ్యాధితో బాధపడుతోంది. చికిత్స కోసం అవసరమయ్యే ఇంజెక్షన్‌ డోసు కోసం రూ.16 కోట్లు ఖర్చు చేయాలని వైద్యులు తెలిపారు. అంత మొత్తం ఎలా తేవాలని బాధపడుతున్న తల్లిదండ్రులకు లాటరీ రూపంలో అదృష్టం వరించింది. చిన్నారికి ఊపిరిపోసింది. ఎస్‌ఎమ్‌ఏ చికిత్సకు అవసరమైన మందును సరఫరా చేసే యూఎస్‌కు చెందిన ‘టర్బైన్‌ డ్రగ్‌ కంపెనీ’ నిర్వహించిన లక్కీ డ్రాలో ఉచితంగా మందును పొందే అవకాశం దక్కించుకున్న ముగ్గురిలో ఈ దంపతుల గారాలపట్టి ఉంది. శనివారం సాయంత్రం చిన్నారి జుహా జైనాబ్‌కు దిల్లీలోని ఆసుపత్రిలో ఇంజెక్షన్‌ చేసిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఇంకో వారం వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఇంటికి తిరిగొస్తామని తల్లిదండ్రులు కోయంబత్తూరుకు చెందిన అయేషా, అబ్దుల్లా తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని