Covid యాంటీబాడీలను పసిగట్టే కొత్త సాధనం

తాజా వార్తలు

Updated : 29/06/2021 07:39 IST

Covid యాంటీబాడీలను పసిగట్టే కొత్త సాధనం

వాషింగ్టన్‌: కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2, ఇతర కరోనా వైరస్‌లు సోకినప్పుడు మానవ శరీరంలో వెలువడే యాంటీబాడీలను గుర్తించే ఒక సాధనాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అవి నిర్దిష్టంగా ఏ వేరియంట్‌ కారణంగా ఉత్పన్నమయ్యాయన్నది కూడా వంద శాతం కచ్చితత్వంతో ఇది గుర్తించగలదు. కొవిడ్‌ బాధితుల్లో వ్యాధి తీవ్రతను ముందే గుర్తించడానికి, వైరస్‌ వేరియంట్ల బారి నుంచి ఒక వ్యక్తికి ఎంత మేర రక్షణ ఉందన్నది తెలుసుకోవడానికి ఇది వీలు కల్పించొచ్చని వివరించారు. ఈ సాధనానికి ‘డి4 అసే’ అని పేరు పెట్టారు. ఇది ప్రామాణిక పీసీఆర్‌ పరీక్షతో పోలిస్తే ఒక రోజు ముందుగానే ఎబోలా ఇన్‌ఫెక్షన్లను పసిగట్టగలదు. ప్రస్తుతమున్న, భవిష్యత్‌లో రాబోయే ఇతర వ్యాధులను పట్టుకోవడానికీ దీన్ని ఉపయోగించొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సాధనంలో ఒక పాలీమర్‌ బ్రష్‌ ఉంటుంది. ఇది నాన్‌స్టిక్‌ పూతలా పనిచేస్తుంది. రక్త నమూనాలోని నిర్దేశిత బయోమార్కర్లు మినహా ఇతర పదార్థాలేవీ ‘టెస్ట్‌ స్లైడ్‌’ను తాకకుండా అది అడ్డుకుంటుంది. తద్వారా యాంటీబాడీలను గుర్తిస్తుంది. ఈ పరీక్ష నిమిషాల్లోనే పూర్తవుతుంది. విద్యుత్‌ అవసరం లేకుండా కూడా ఈ సాధనం పనిచేస్తుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని