అందులో మా తప్పేమీ లేదు: భారత్‌ బయోటెక్‌

తాజా వార్తలు

Updated : 01/07/2021 08:31 IST

అందులో మా తప్పేమీ లేదు: భారత్‌ బయోటెక్‌

కొవాగ్జిన్‌ కొనుగోలుపై బ్రెజిల్‌ వెనక్కి

ఈనాడు, హైదరాబాద్‌: బ్రెజిల్‌కు కొవాగ్జిన్‌ టీకా సరఫరా చేసే కాంట్రాక్టు వ్యవహారంలో తమ తప్పేమీ లేదని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ స్పష్టం చేసింది. ఇతర దేశాలకు టీకా సరఫరా చేయటానికి ఎటువంటి పద్ధతి పాటిస్తున్నామో అదే పద్ధతిని బ్రెజిల్‌ విషయంలోనూ అనుసరించినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. బ్రెజిల్‌ నుంచి తమకు అడ్వాన్సు చెల్లింపులు జరగలేదని, తాము టీకా సరఫరా చేయలేదని వివరించింది. బ్రెజిల్‌కు 2 కోట్ల డోసుల టీకా సరఫరా చేసే నిమిత్తం ఆ దేశానికి చెందిన ప్రిసిసా మెడికమెంతోస్‌ అనే సంస్థతో కొంతకాలం క్రితం భారత్‌ బయోటెక్‌ ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ 32.4 కోట్ల డాలర్లు. ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగినట్లు పెద్దఎత్తున ఆరోపణలు రావటంతో బ్రెజిల్‌ ప్రభుత్వం తాత్కాలికంగా దీనిని రద్దుచేసింది. దీనిపై విచారణ కొనసాగుతోంది.

మరోవంక.. ‘కొవాగ్జిన్‌’ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అత్యవసర అనుమతి లభించే దిశగా మరో కీలకమైన ముందడుగు పడింది. జూన్‌ 23న డబ్ల్యూహెచ్‌ఓ నిర్వహించిన ప్రీ-సబ్‌మిషన్‌ సమావేశంలో భారత్‌ బయోటెక్‌ పాల్గొని పూర్తి సమాచారాన్ని అందించిన విషయం విదితమే. ఆ తర్వాత మలిదశ విశ్లేషణకు (రోలింగ్‌ డేటా) ఈ అంశాన్ని డబ్ల్యూహెచ్‌ఓ స్వీకరించింది. ఈ విషయాన్ని భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ ఎండీ సుచిత్ర ఎల్ల ట్విటర్‌లో వెల్లడించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని