Coronavaccine: టీకా వేయించుకుంటే.. షాపింగ్‌ వోచర్లు.. పిజ్జా డిస్కౌంట్లు

తాజా వార్తలు

Published : 02/08/2021 06:58 IST

Coronavaccine: టీకా వేయించుకుంటే.. షాపింగ్‌ వోచర్లు.. పిజ్జా డిస్కౌంట్లు

బ్రిటన్‌ ప్రభుత్వం వినూత్న చర్యలు

లండన్‌: కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకునే వారి సంఖ్యను పెంచేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం వినూత్న పథకాల అమలుపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా షాపింగ్‌ వోచర్లు, పిజ్జా డిస్కౌంట్లు, ప్రయాణాల్లో రాయితీలతో ‘వ్యాక్సిన్‌ వోచర్స్‌’ పథకాన్ని తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది. అధిక సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ఈ విధానం దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే అనేక రైడ్‌-హెయిలింగ్‌, ఫుడ్‌ డెలివరీ యాప్‌లు టీకా తీసుకున్న వారికి ప్రయాణ, భోజన రాయితీలు కల్పిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొస్తున్న ‘వ్యాక్సిన్‌ వోచర్స్‌’ పథకంలో ఉబెర్‌, బోల్ట్‌, డెలివెరూ, పిజ్జా పిలిగ్రిమ్స్‌ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. వినియోగదారులకు వివిధ రాయితీలు ప్రకటిండచమే కాకుండా వారు మొదటి, రెండో డోసు టీకా వేసుకునేందుకు తమ వంతుగా సహాయపడతామని పిజ్జా పిలిగ్రిమ్స్‌ వ్యవస్థాపకుడు థామ్‌ ఇలియట్‌ పేర్కొన్నారు. ప్రజలందరూ టీకాలు వేసుకోవడం, సురక్షితంగా సాధారణ స్థితికి చేరుకోవడంలో ఈ పథకం దోహదపడుతుందని డెలివెరూ ప్రతినిధి తెలిపారు. మరోవైపు.. ఈ పథకం ఎలా పని చేస్తుందన్న వివరాలను ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదని స్థానిక మీడియా పేర్కొంది. టీకాలు పొందడం ద్వారా ప్రభుత్వంతో భాగస్వామ్యమైన ఆయా సంస్థల్లో రాయితీలు పొందాలని బ్రిటన్‌ వ్యాక్సిన్‌ మంత్రి నదిమ్‌ జహావి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని