ఖనిజ సంపదపై చైనా కన్ను

తాజా వార్తలు

Updated : 20/08/2021 08:06 IST

ఖనిజ సంపదపై చైనా కన్ను

బీజింగ్‌: అఫ్గాన్‌ తాలిబన్ల వశం కావడంతో అక్కడ లభించే విలువైన ‘రేర్‌ ఎర్త్స్‌’ ఖనిజాలపై చైనా కన్నేసింది. కంప్యూటర్లు, రీఛార్జబుల్‌ బ్యాటరీలు, పవన విద్యుత్తు టర్బయిన్లు, హైబ్రిడ్‌ కార్లు, టెలివిజన్లు, సూపర్‌ కండక్టర్లు తదితర అత్యాధునిక సాంకేతిక పరికరాల తయారీకి వీటి అవసరం ఎంతగానో ఉంది. ఇప్పటికే ప్రపంచంలోని 85 శాతం రేర్‌ ఎర్త్స్‌ ఖనిజాలను సొంతం చేసుకున్న చైనా ఇప్పుడు వీటిపైనా గురి పెట్టిందని అఫ్గాన్‌ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో పెట్రోలియం బావులు, రాగి గనుల తవ్వకాలపై ఆ దేశంతో ఒప్పందాలు కుదుర్చుకొంది. అనుకూల ప్రభుత్వం రావడంతో మరింతగా ముందుకు వెళ్లనుందన్న అంచనాలు ఉన్నాయి. చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి హువా చిన్‌యుంగ్‌ మాట్లాడుతూ తాలిబన్లు మారారని చెప్పారు. తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటయితే గుర్తింపు ఇస్తామన్నారు.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని