Coronavirus: చిన్నారుల్లోనూ ‘లాంగ్‌ కొవిడ్‌’

తాజా వార్తలు

Updated : 10/09/2021 07:07 IST

Coronavirus: చిన్నారుల్లోనూ ‘లాంగ్‌ కొవిడ్‌’

పెద్దలతో పోలిస్తే స్వల్పమే

వాషింగ్టన్‌: కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కొందరిని దీర్ఘకాలం పాటు ఆ ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన ఆరోగ్య సమస్యలు (లాంగ్‌ కొవిడ్‌) పీడిస్తుంటాయి. చిన్నారులకూ ఈ ఇబ్బంది ఉంటుందా అంటే.. నిపుణుల నుంచి ఔననే సమాధానం వస్తోంది. అయితే పెద్దలతో పోలిస్తే వీరికి ఈ ముప్పు తక్కువేనని చెబుతున్నారు. బ్రిటన్‌లో నిర్వహించిన ఒక అధ్యయనంలో ఇది స్పష్టమైంది. కరోనా బారినపడిన చిన్నారుల్లో 4 శాతం మందికే.. ఇన్‌ఫెక్షన్‌ సోకిన నెల తర్వాత కూడా ఇబ్బందులు కొనసాగాయని వెల్లడైంది. దీనికి భిన్నంగా పెద్దల్లో ఇది 30 శాతంగా ఉంది. పిల్లల్లో ఎక్కువగా కనిపించే లాంగ్‌ కొవిడ్‌ లక్షణాల్లో.. అలసట, తలనొప్పి, వాసన సామర్థ్యం తగ్గిపోవడం వంటివి ఉన్నాయి. రెండు నెలలు గడిచాక వీటిలో చాలావరకూ తగ్గిపోయాయి. కొన్నిసార్లు.. దగ్గు, ఛాతీలో నొప్పి, జ్ఞాపకశక్తి తగ్గడం వంటివి కూడా చిన్నారుల్లో కనిపించాయి. చాలా అరుదుగా మాత్రమే వారిలో శరీరంలో వివిధ అవయవాలపై ప్రభావం చూపే ‘మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌’ తలెత్తుతున్నట్లు గుర్తించారు. లాంగ్‌ కొవిడ్‌కు నిర్దిష్ట కారణాలు శాస్త్రవేత్తలకు బోధపడటంలేదు. అయితే ఇన్‌ఫెక్షన్‌ కారణంగా అవయవాలు దెబ్బతిని, ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చని భావిస్తున్నారు. శరీరంలో ఇంకా కొనసాగుతున్న వైరస్‌, ఇన్‌ఫ్లమేషన్‌ కూడా దీనికి కారణమై ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. 


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని