Covaxin: కొవాగ్జిన్‌కు అనుమతిపై త్వరలో నిర్ణయం: డబ్ల్యూహెచ్‌వో

తాజా వార్తలు

Updated : 01/10/2021 07:04 IST

Covaxin: కొవాగ్జిన్‌కు అనుమతిపై త్వరలో నిర్ణయం: డబ్ల్యూహెచ్‌వో

ఐరాస: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవిడ్‌ టీకా ‘కొవాగ్జిన్‌’కు అనుమతి మంజూరుచేసే విషయమై... త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. కొవాగ్జిన్‌ క్లినికల్‌ పరీక్షలకు సంబంధించిన డేటా క్రోడీకరణ ఈ ఏడాది జూన్‌లోనే పూర్తయింది. ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌ (ఈయూఎల్‌) నిమిత్తం భారత్‌ బయోటెక్‌ ఈ వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు పూర్తిస్థాయిలో సమర్పించింది. ప్రస్తుతం దీనిపై సమీక్ష కొనసాగుతున్నట్టు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. అక్టోబరులో నిర్ణయం వెల్లడిస్తామని తాజాగా తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని