ఆ జాబితా నుంచి పాండాల తొలగింపు

తాజా వార్తలు

Published : 09/07/2021 20:30 IST

ఆ జాబితా నుంచి పాండాల తొలగింపు

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత ఐదారేళ్లుగా చైనా తీసుకున్న సంరక్షణ చర్యల వల్ల పాండాలు అంతరించే జంతువుల నుంచి అపాయంలో ఉన్న జంతువుల జాబితాలోకి వచ్చాయి. 2016లో వాటిని అంతరించే జంతువుల జాబితాలో చేర్చారు.  సాధారణంగా ఆయా జంతువులను వేటాడటం లేదా వాటి ఆవాసాలను నాశనం చేయడం వల్ల అవి  అంతరిస్తుంటాయి. పాండాలకు పుట్టిల్లు చైనా. ఆ దేశం వాటిని జాతీయ సంపదగా భావిస్తుంది. అయితే ఇతర దేశాలతో సత్సంబంధాల కోసం, వేరే దేశాల నాయకులు తమ దేశాన్ని సందర్శించినప్పుడు వాటిని బహూకరించేది. కానీ ఇటీవలి కాలంలో ఎలాగైనా వాటిని కాపాడుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం రక్షణా చర్యలను చేపట్టింది. సహజంగా పాండాలు వెదురు అడవుల్లోనే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాటి ఆహారం వెదురు పొదలే. రోజుకు ఒకపాండా 8 నుంచి 15 కేజీల వెదురును ఆరగిస్తుంది. వాటి ఆవాసాలను కాపాడటం, వెదురు అడవులను విస్తరింపజేయడం వల్ల వాటి సంతతి వృద్ధి చెందింది. ప్రస్తుతం పాండాల సంఖ్య 1800కు చేరింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పర్యావరణ ప్రేమికులు, జంతు సంరక్షణోద్యమకారులు సోషల్‌ మీడియా వేదికగా హర్షాతిరేకాలు వెలిబుచ్చుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని