15 కోట్ల మార్కును దాటిన కరోనా కేసులు

తాజా వార్తలు

Published : 30/04/2021 18:17 IST

15 కోట్ల మార్కును దాటిన కరోనా కేసులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: శుక్రవారం ఉదయం నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య 15 కోట్ల మార్కును దాటింది. జాన్స్‌ హాప్కిన్స్‌ విశ్వ విద్యాలయంలోని సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో కొవిడ్‌-19 గ్లోబల్‌ డాష్‌ బోర్డు లెక్కల ప్రకారం శుక్రవారం ఉదయం 9:51 నిమిషాల నాటికి 15,01,33,654 కరోనా కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 31,62,166 గా ఉంది. కరోనా విజృంభణలో 3,22,88,689 కరోనా కేసులు, 5,75,193 మరణాలతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా 1.83 కోట్ల కరోనా కేసులు, 2,04,832 మరణాలు సంభవించి భారత్‌ రెండో స్థానంలో ఉంది.

కాగా, కరోనాతో పోరాటానకి భారత్‌కు అండగా నిలిచేందుకు 40కి పైగా దేశాలు ముందుకు వచ్చాయని భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ ష్రింగ్లా తెలిపారు. ఇప్పటికే యూకే, రొమేనియా, ఐర్లాండ్‌  దేశాలు పంపిన ఆక్సిజన్‌ సిలిండర్లు, ఔషధ సామాగ్రి దిల్లీ చేరుకున్నాయని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 2,97,540 కరోనా కేసులు నమోదు కాగా కరోనా వైరస్‌ సోకి 3,498 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 31,70,228 యాక్టివ్‌ కేసులున్నాయి. అలాగే ఇప్పటి వరకూ 1.5 కోట్ల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని