భారత్‌లో టీకా..అంతర్జాతీయంగా ప్రశంసలు

తాజా వార్తలు

Updated : 05/01/2021 14:26 IST

భారత్‌లో టీకా..అంతర్జాతీయంగా ప్రశంసలు

దిల్లీ: కరోనా వైరస్ టీకాలకు భారత్‌ ఆమోదం తెలపడంపై అంతర్జాతీయ సంస్థలు, ప్రముఖుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ క్రమంలో మహమ్మారిని అంతం చేయాలనే భారత్ సంకల్పాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొనియాడింది. అలాగే దేశ నాయకత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకుందని పేర్కొంది.

WHO డైరెక్టర్‌ జనరల్ టెడ్రోస్ అధనామ్: భారత్ నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటూ, కొవిడ్‌-19 మహ్మమారిని అంతం చేయాలనే సంకల్పాన్ని ప్రదర్శిస్తోంది. అతిపెద్ద టీకా ఉత్పత్తిదారుగా అలా చేయడం మంచిదే. మనం కలిసి పనిచేస్తే, అత్యంత ప్రమాదం పొంచి ఉన్న వర్గాలను రక్షించగలం. సమర్థవంతమైన, సురక్షితమైన టీకాలు ఉపయోగిస్తున్నామని నిర్ధారించగలం.

బిల్‌గేట్స్: ప్రపంచమంతా కొవిడ్‌-19కు ముగింపు పలకాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో శాస్త్రీయ ఆవిష్కరణ, టీకా తయారీ సామర్థ్యంలో భారత‌ నాయకత్వం గొప్పగా ఉంది.

అలాగే వీరిద్దరు ట్విటర్ వేదికగా భారత్ ప్రయత్నాలను ప్రశంసించడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీని ట్యాగ్ చేశారు. 

కాగా, అత్యవసర వినియోగం కింద కొవిగ్జాన్, కొవిషీల్డ్ టీకాలకు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ ఆదివారం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే ఆ నిర్ణయాన్ని ఆరోగ్య సంస్థ స్వాగతించింది. కరోనాపై చేస్తున్న పోరాటాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు కట్టడిని ఉద్ధృతం చేయడంలో భారత్ నిర్ణయం దోహదపడుతుందని అభిప్రాయపడింది. 

ఇవీ చదవండి:

మోదీ నాయకత్వం వల్లే టీకా సాకారం: షా

58కి చేరిన యూకే కరోనా కేసులు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని