close

తాజా వార్తలు

Updated : 24/02/2021 11:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గోల్ఫ్‌ సూపర్‌స్టార్‌ టైగర్‌ వుడ్స్‌ కారు బోల్తా

కాలిఫోర్నియా: గోల్ఫ్‌ సూపర్‌స్టార్‌ టైగర్‌ వుడ్స్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో ఆయన కారు బోల్తా పడింది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 7.12 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో కారులో ఆయన ఒక్కరే ఉన్నారు. కారు బోల్తా పడడంతో వెంటనే బెలూన్స్‌ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న లాస్‌ఏంజిల్స్‌ అగ్నిమాపక సిబ్బంది, పారామెడికల్‌ సిబ్బంది ఆయనను కారు నుంచి వెలుపలికి తీసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో కారు ఒక పక్క పూర్తిగా ధ్వంసమైంది. వుడ్స్‌ కాళ్లకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. 

45 ఏళ్ల టైగర్‌ వుడ్స్‌ ఇప్పటివరకు పీజీఏలో 82 టైటిళ్లు సొంతం చేసుకున్నాడు. 15 మేజర్‌ ఛాంపియన్‌షిఫ్‌లను కైవసం చేసుకున్నాడు. ఇందులో ఐదు మాస్టర్‌ టోర్నమెంట్‌లు సైతం ఉన్నాయి.   2009లో ఫ్లోరిడాలో జరిగిన కారు ప్రమాదంలో కూడా వుడ్స్‌ గాయపడ్డాడు.


ఇవీ చదవండి


Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని