close

తాజా వార్తలు

Published : 14/01/2021 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వ్యాక్సిన్‌పై అసత్య వార్తలకు అడ్డుకట్ట

3 మిలియన్ల డాలర్లతో గూగుల్‌ కార్యక్రమం

కాలిఫోర్నియా: వ్యాక్సిన్‌ పంపిణీలో వచ్చే అసత్యవార్తలకు అడ్డుకట్ట వేసేందుకు గూగుల్‌ న్యూస్‌ గ్లోబల్‌ ఓపెన్‌ ఫండ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికోసం 3 మిలియన్ల డాలర్లను గూగుల్‌ ఖర్చుపెట్టనుంది. ‘కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కౌంటర్‌ మిస్‌ఇన్ఫర్మేషన్‌ ఓపెన్‌ ఫండ్‌’ అనేది వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియలో వ్యాప్తి చెందే అసత్య సమాచారాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుందని గూగుల్‌ ఒక బ్లాగ్‌ పోస్టులో తెలిపింది. ‘‘కరోనా మొత్తం ప్రపంచంపై చాలా పెద్ద ప్రతికూల ప్రభావాన్ని చూపింది. అదే విధంగా అసత్య వార్తలు, తప్పుడు సమాచారం కూడా ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని కొన్ని నివేదికల ద్వారా వెల్లడైంది. ఎప్పటికప్పుడు ఫాక్ట్‌ చెక్‌ చేయడం ద్వారా దీనిని మనం నిరోధించవచ్చు.’’ అని గూగుల్‌ తెలిపింది. ఈ అసత్య సమాచారాల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలను ఫాక్ట్‌ చెక్‌ వైపు నడిపించే ప్రయత్నాలు చేసే ప్రాజెక్టులను ఈ ఫండ్‌లో భాగస్వాములుగా చేర్చుకుంటామని తెలిపారు. అన్ని రంగాల నుంచి వచ్చిన దరఖాస్తులను 14 మందితో కూడిన బృందం పరిశీలిస్తుందని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు కూడా ఇందులో భాగస్వాములు కావొచ్చని తెలిపింది. గతేడాది డిసెంబరులో కొవిడ్‌ 19పై అసత్య ప్రచారాలను అడ్డుకొనేందుకు 1.5మిలియన్ల డాలర్లతో ఒక ఫండ్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

ఇవీ చదవండి..

ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు..

హతవిధీ.. ట్రంప్‌ పరిస్థితి


Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని