గూగుల్‌ మ్యాప్స్‌లో ఎకోఫ్రెండ్లీ మార్గాలు

తాజా వార్తలు

Updated : 31/03/2021 11:17 IST

గూగుల్‌ మ్యాప్స్‌లో ఎకోఫ్రెండ్లీ మార్గాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: గూగుల్‌ మ్యాప్స్‌ వినియోగదారులకు మరిన్ని  అదనపు సేవలు అందనున్నాయి. డ్రైవర్లకు పర్యావరణ హిత (ఎకోఫ్రెండ్లీ) మార్గాలను గూగుల్‌ మ్యాప్స్‌ సూచించనుంది. పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ మార్గలను ఎంపిక చేయనున్నారు. ముఖ్యంగా సదరు డ్రైవర్‌ వాహనం ఏ మార్గంలో ప్రయాణిస్తే అతితక్కువ  ఉద్గారాలు విడుదలవుతాయో.. ఆ మార్గాన్ని ఇది సూచించనుంది. ముఖ్యంగా ట్రాఫిక్‌, ఘాట్‌రోడ్‌ వంటి మార్గాలను పరిగణనలోకి తీసుకోనుంది. ఈ సేవలను తొలుత అమెరికాలో ప్రవేశపెట్టి ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విస్తరించనున్నట్లు గూగుల్‌ పేర్కొంది.

పర్యావరణ మార్పులపై పోరులో భాగంగా ఈ సేవలను అందిస్తున్నట్లు గూగుల్‌ వెల్లడించింది. గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌లో ఎకోఫ్రెండ్లీ అనే ఆప్షన్‌ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో వేగవంతమైన ప్రత్యామ్నాయ మార్గాలను చూపించి.. ఆ మార్గంలో ప్రయాణిస్తే వెలువడే ఉద్గారాలను కూడా లెక్కగట్టి చెబుతుంది. అమెరికా ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్‌ రినెవేబుల్‌  ఎనర్జీ ల్యాబ్‌లో గూగుల్ వివిధ కార్లను ఉపయోగించి.. ఉద్గారాలను లెక్కగట్టింది. గూగుల్‌ స్ట్రీట్‌ వ్యూ ఉపగ్రహాల చిత్రాల ఆధారంగా వీధులను విశ్లేషిస్తుంది.

జోన్‌ హెచ్చరికలు..

కొన్ని రకాల వాహనాల రాకపోకలు నిషేధించిన లోఎమిషన్స్‌ జోన్లపై గూగుల్‌ మ్యాప్స్‌ జూన్‌ నుంచి డ్రైవర్లకు ముందుగానే తెలియజేస్తుంది.  జర్మనీ,ఫ్రాన్స్‌, ది నెదర్లాండ్స్‌,స్పెయిన్‌,యూకే తదితర ప్రాంతాల్లో ఇటువంటి జోన్లు ఉంటాయి. ‘‘ఆమ్‌స్టర్‌డ్యామ్‌ నుంచి జకార్త వరకు ఇటువంటి లోఎమిషన్‌ జోన్లను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాల్లోకి డీజిల్‌ కార్ల వంటి కాలుష్యకారక వాహనాలను నిషేధించారు. ఇలాంటి వాటికి మద్దుతగానే మేము డ్రైవర్లను ముందుగానే అప్రమత్తం చేస్తాము ’’ అని గూగుల్‌ తన బ్లాగ్‌పోస్టులో పేర్కొంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని