close

తాజా వార్తలు

Published : 23/01/2021 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆస్ట్రేలియాను హెచ్చరించిన గూగుల్‌!

బెదిరింపులకు స్పందించమన్న ప్రధాని

బ్రిస్బేన్‌: సామాజిక మాధ్యమాల వార్తలకు చెల్లింపుల విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టం నిలుపుదల చేయకుంటే అక్కడ సెర్చ్‌ ఇంజిన్‌ సేవలను నిలిపివేస్తామని గూగుల్‌ హెచ్చరించింది. అయితే, టెక్‌ దిగ్గజాల బెదిరింపులకు స్పందించబోమని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మారిసన్‌ స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో చేసిన ఈ చట్టాలు దేశ ప్రయోజనాల కోసమని, ప్రభుత్వం చేసిన చట్టాలకు అనుగుణంగానే ఇక్కడ నడుచుకోవాల్సి ఉందని ఘాటుగా బదులిచ్చారు.

సామాజిక మాధ్యమాల్లో వినియోగించే వార్తలకు, స్నిప్పెట్‌లకు చెల్లింపుల విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం నూతన చట్టాన్ని ప్రతిపాదించింది. తద్వారా ఆస్ట్రేలియాలోని మీడియా సంస్థల వార్తలను వినియోగించుకున్నందుకు గూగుల్‌ వంటి సామాజిక మాధ్యమ సంస్థలు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే ఆర్థికంగా తమ సంస్థకు ఎంతో నష్టమని..అందుకే ఆస్ట్రేలియాలో సెర్చ్‌ ఇంజిన్‌ నిలిపివేస్తామని గూగుల్‌ ఆస్ట్రేలియా ప్రతినిధి సిల్వా అక్కడి సెనేటర్లకు వివరించారు. ఇది కేవలం మా సంస్థకే కాకుండా ప్రతినిత్యం గూగుల్‌ ఉత్పత్తులను వినియోగించే ఆస్ట్రేలియా ప్రజలకు, మీడియా సంస్థలకు, చిన్న వ్యాపారులకు ఎంతో నష్టమని ఆమె హెచ్చరించారు. మరే దేశంలో లేనంతగా గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌పైనే ఆస్ట్రేలియా ఎక్కువగా ఆధారపడిందని.. దేశవ్యాప్తంగా చేసే సెర్చ్‌లలో 95శాతం గూగుల్‌ ద్వారానే చేస్తారని పేర్కొన్నారు. అయినప్పటికీ తాము తీసుకొచ్చిన చట్టాల ప్రకారమే నడుచుకోవాలని ప్రధానమంత్రి స్కాట్‌ మారిసన్‌ స్పష్టం చేశారు.

అదే దారిలో ఫేస్‌బుక్‌..
సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తల కంటెంట్‌పై ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన నిబంధనలను ఫేస్‌బుక్‌ కూడా వ్యతిరేకిస్తోంది. ఒకవేళ చట్టం అమలైతే మాత్రం ఆస్ట్రేలియాలో ఫేస్‌బుక్‌లో వార్తా కథనాలను తొలగిస్తామని ప్రకటించింది. అయితే, టెక్‌ దిగ్గజాలు చేస్తోన్న బెదిరింపులపై వెనక్కి తగ్గవద్దని ఆస్ట్రేలియా నిపుణుల బృందం అక్కడి ప్రభుత్వానికి సూచిస్తోంది.

ఇవీ చదవండి..
‘సమోసా’ కలిపింది ఇద్దర్నీ..! మోదీ
చైనాకు చురకలంటించిన ఆస్ట్రేలియా ప్రధాని



Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని