Corona: ఆ వైఖరే రెండోదశకు కారణమైంది
close

తాజా వార్తలు

Published : 19/06/2021 12:30 IST

Corona: ఆ వైఖరే రెండోదశకు కారణమైంది

మాస్కుల పంపిణీ కార్యక్రమంలో హర్షవర్ధన్

దిల్లీ: ఒకవైపు కరోనా వైరస్ రూపాంతరం చెందుతుండగా.. మరోవైపు ప్రజలు నిబంధనల విషయంలో నిర్లక్ష్యంగా ఉండటమే వైరస్ రెండోదశకు దారితీసిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. ఆరోగ్యశాఖలో ఫ్రంట్‌లైన్ సిబ్బందికి మాస్కులు పంపిణీ చేసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్‌ సంస్థలు, వివిధ పదవుల్లో ఉన్న నేతలు ఈ కార్యక్రమాన్ని కొనసాగించి.. విస్తృతం చేయాలని కోరారు. దీనిద్వారా కొవిడ్‌ను కట్టడి చేయొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

‘గత సంవత్సరం కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అహర్నిశలు పనిచేసింది. ప్రధాని మోదీ నాయకత్వంలో క్రియాశీల కేసులను కనిష్ఠ స్థాయికి చేర్చడంలో చెప్పుకోదగ్గ విజయం సాధించాం. అయితే ఈ ఏడాది ప్రారంభంలో దేశంలో టీకాలు అందుబాటులోకి వచ్చాయి. కేసులు కూడా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వాలు ఆంక్షలను సడలించాయి. కొవిడ్ నియమావళిని ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవడంతో వైరస్ వ్యాప్తి చెందింది. వాటికి కొత్త రకాలు తోడయ్యాయి. ఇవన్నీ కలిసి రెండో దఫా ఉద్ధృతికి దోహదం చేశాయి’ అని హర్షవర్ధన్‌ వెల్లడించారు.

ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమైందని, మరోసారి వైరస్ వ్యాప్తి చెందకుండా చూడటమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. కరోనా వేరియంట్లకు చెక్‌ పెట్టడానికి మాస్కే ప్రధాన ఆయుధమని స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని