DA: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ పెంపు

తాజా వార్తలు

Published : 21/10/2021 15:50 IST

DA: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ పెంపు

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కరవు భత్యం(డీఏ)ను 3శాతం పెంచింది. ఈ మేరకు గురువారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాలను కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. ఉద్యోగులకిచ్చే డీఏ, పెన్షనర్లకు ఇచ్చే డీఆర్‌ను 3శాతం పెంచుతున్నట్లు తెలిపారు. ఈ పెంపు జులై 2021 నుంచే అమలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 28శాతం ఉండగా.. తాజా నిర్ణయంతో 31శాతానికి చేరింది. 

కేంద్ర నిర్ణయంతో 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం కలగనుంది. డీఏ పెంపుతో కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,488.70కోట్ల మేర అదనపు భారం పడనుంది. కరోనా మహమ్మారితో నెలకొన్న సంక్షోభం దృష్ట్యా గతేడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జులై నుంచి దాన్ని పునరుద్ధరించడమే గాక.. 17శాతం ఉన్న డీఏను 28శాతానికి పెంచారు. ఇప్పుడు మరో 3శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని