రైతులతో చర్చలకు సిద్ధం
close

తాజా వార్తలు

Published : 02/02/2021 19:03 IST

రైతులతో చర్చలకు సిద్ధం

లోక్‌సభలో వెల్లడించిన కేంద్రం

దిల్లీ:  రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని మంగళవారం కేంద్రప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం విపక్షాల ఆందోళనలతో ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. దీంతో 5 గంటలకు ప్రారంభమైన జీరో అవర్‌లో వ్యవసాయశాఖ మంత్రి మాట్లాడుతూ.. రైతుల సమస్యలను చర్చించేందుకు కేంద్రం పార్లమెంటు బయట, లోపల ఎప్పుడైనా సిద్ధంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ నాయకుడు అధిర్‌ రంజన్‌ ఛౌదరి ప్రశ్నలకు సమాధానంగా తోమర్‌ స్పందించారు. అధిర్‌ రంజన్‌ ఛౌదరి మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న రైతు ఉద్యమంలో 170కి పైగా రైతులు మరణించారన్నారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు బ్రిటీష్‌ పాలనను తలపిస్తుందన్నారు. సభలో శివసేన, కాంగ్రెస్‌, డీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీ పార్టీ సభ్యులు రైతులకు మద్దతుగా నినాదాలు చేస్తూ స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో స్పీకర్‌ సభను 7 గంటల వరకూ వాయిదా వేశారు. రైతులకు సంబంధించిన ప్రశ్నలన్నింటినీ సిద్ధం చేసుకొని ప్రశ్నోత్తరాల సమయంలో అడగాలని స్పీకర్ విపక్షాలకు సూచించారు.

ఇవీ చదవండి..

ఇది మోదీ స్టైల్‌ పరిపాలన

భారతీయ ప్రతిభకు నాసాలో భవ్య స్థానం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని