15 రోజుల్లో రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తి రెట్టింపు

తాజా వార్తలు

Published : 18/04/2021 23:08 IST

15 రోజుల్లో రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తి రెట్టింపు

కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా 

దిల్లీ: దేశంలో రోజురోజుకూ కరోనా ఉద్ధృతి పెరగడంతో రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తిని పెంచే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. రానున్న 15 రోజుల్లో రోజుకు 3 లక్షల వయల్స్ ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవియా తెలిపారు. ప్రస్తుతం నిత్యం లక్షన్నర వయల్స్‌ రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తి జరుగుతోందని.. మరో రెండు వారాల్లోనే వీటి ఉత్పత్తి రెండింతలు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 20 ప్లాంట్లలో రోజుకు 1.5 లక్షల వయల్స్ ఉత్పత్తి జరుగుతోందని చెప్పారు. వాటికి అదనంగా మరో 20 ప్లాంట్లలో రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించారు.

ఇక కొవిడ్‌-19 వ్యాధి తీవ్రంగా ఉన్న బాధితుల్లో వినియోగించే ఔషధమైన రిమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ ధరను తగ్గిన విషయం తెలిసిందే. రెమ్‌డెసివిర్‌ ఔషధానికి కొరత ఏర్పడటం, బ్లాక్‌మార్కెట్‌లో అధిక ధరకు విక్రయాలు జరగడంతో ఇటీవల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వార్తలు వచ్చాయి. దీంతో మందును అధికంగా ఉత్పత్తి చేయడంతో పాటు ధర తగ్గించాలని ప్రభుత్వం ఫార్మా కంపెనీలకు సూచించింది. కేంద్ర ప్రభుత్వం చొరవతో ధర తగ్గించేందుకు ఫార్మా కంపెనీలు అంగీకరించాయి. ప్రస్తుతం ఈ ఔషధాన్ని దేశంలో ఏడు ఫార్మా సంస్థలు తయారు చేస్తున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని