బ్యాంకుల ప్రైవేటీకరణకు ఆర్‌బీఐతో పనిచేస్తాం

తాజా వార్తలు

Published : 08/02/2021 12:49 IST

బ్యాంకుల ప్రైవేటీకరణకు ఆర్‌బీఐతో పనిచేస్తాం

ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

దిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రణాళికను అమలుపరిచేందుకు ఆర్‌బీఐతో కలిసి పనిచేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ప్రైవేటీకరణకు సంబంధించిన వివరాలు సిద్ధమవుతున్నాయని, త్వరలోనే ప్రకటిస్తామని ఆమె పేర్కొన్నారు. ముంబయిలో విలేకరులతో మాట్లాడిన సీతారామన్‌ బ్యాంకులను అప్పగించే వ్యక్తుల వివరాలు తెలియజేసేందుకు నిరాకరించారు. బ్యాంకుల నిరర్ధక ఆస్తుల బదిలీకి ఏర్పాటు చేయబోయే నేషనల్‌ అస్సెట్‌ రీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఎన్‌ఏఆర్‌సీ)కి ప్రభుత్వం తరఫున కొంతమేర హామీ ఉంటుందని తెలిపారు. బ్యాంకుల పనితీరు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందన్న ఆమె అగ్రికల్చరల్ ఇన్‌ఫ్రా సెస్‌ ద్వారా కేంద్రానికి రూ.30 వేల కోట్లు సమకూరే అవకాశం ఉందన్నారు. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తే ఆమేరకు రాష్ట్రాలు పన్నులు పెంచుకొని ఆదాయాన్ని సంపాదించుకుంటాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించడం వల్ల రేట్లలో పెద్దగా మార్పు ఉండబోదని సీతారామన్‌ వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి...

కేంద్రం ఆ పని చేయాల్సింది కాదు: రాజ్‌ ఠాక్రే

ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యల పునరుద్ధరణTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని