టూల్‌కిట్‌ కేసు: శంతనుకు ట్రాన్సిట్‌ బెయిల్‌

తాజా వార్తలు

Published : 16/02/2021 21:50 IST

టూల్‌కిట్‌ కేసు: శంతనుకు ట్రాన్సిట్‌ బెయిల్‌

ముంబయి: స్వీడన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థెన్‌బర్గ్‌ ‘టూల్‌కిట్‌’ కేసు దర్యాప్తులో భాగంగా నికితా జాకబ్‌, శంతను ములుక్‌లపై నాన్‌బెయిలబుల్‌ వారెంటు జారీ అయిన విషయం తెలిసిందే. వీరిలో శంతను ములుక్‌కు మంగళవారం బొంబాయి హైకోర్టులోని ఔరంగాబాద్‌ ధర్మాసనం పది రోజుల ట్రాన్సిట్‌ ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. మరో సామాజిక కార్యకర్త నికితా జాకబ్‌ బెయిల్‌ పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది. ప్రస్తుతం ఆమె అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గ్రెటా థెన్‌బర్గ్‌ చేసిన ‘టూల్‌కిట్‌’ ట్వీట్‌ వ్యవహారంతో సంబంధం ఉందన్న ఆరోపణలపై నికితా జాకబ్‌, శంతను ములుక్‌లపై దిల్లీ న్యాయస్థానం నాన్‌బెయిలబుల్ వారెంటు జారీ చేసింది. వీరిద్దరూ పరారీలో ఉన్నారని దిల్లీ పోలీసులు పేర్కొనడంతో ముందస్తు బెయిల్‌ కోసం బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు.

ఈ టూల్‌ కిట్‌ వ్యవహారంలో బెంగళూరుకు చెందిన పర్యావరణ కార్యకర్త దిశ రవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గ్రెటా థెన్‌బర్గ్‌ షేర్‌ చేయడంతో ఈ టూల్‌కిట్‌ వెలుగులోకి వచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులకు మద్దతు తలిపేందుకు ఉన్న వివిధ మార్గాలను సూచిస్తూ ఒక గూగుల్‌ డాక్యుమెంట్‌ను తయారు చేశారు. దీన్ని తయారు చేసిన వారిపై దిల్లీ పోలీసులు దేహద్రోహం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని