వందమంది అతిథులు.. పెళ్లి కొడుకు అరెస్ట్‌
close

తాజా వార్తలు

Published : 26/04/2021 17:25 IST

వందమంది అతిథులు.. పెళ్లి కొడుకు అరెస్ట్‌

చండీగఢ్‌: జలంధర్‌లో కొవిడ్‌-19 నిబంధనలను పాటించకుండా పెళ్లి చేసుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రాత్రి ఒక ఆలయంలో జరుగుతున్న రిసెప్షన్‌కి వంద మందికి పైగా అతిథులు పైగా హాజరైనట్లు పోలీసులకు సమాచారం అందింది.  తక్షణమే అక్కడకు చేరుకున్న పోలీసులు పెళ్లి కొడుకును, అతడి తండ్రిని అరెస్టు చేశారు. సదరు వ్యక్తులు వారంతపు కర్ఫ్యూను ఉల్లంఘించారనీ, పైగా కార్యక్రమానకి తమవద్ద నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదనీ, జలంధర్‌ డిప్యూటీ కమీషనర్‌ తెలిపారు. పెళ్లి కొడుకు, అతడి తండ్రి మీద భారత శిక్షాస్మృతి సెక్షన్‌ 188 కింద కేసు నమోదు చేశామన్నారు. 

కాగా పెరుగుతున్న కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు పంజాబ్‌ ప్రభుత్వం వారాంతపు కర్య్ఫూ ప్రకటించింది. మే 30 వరకూ బార్లు, సినిమా హాళ్లు, పార్కులు, జిమ్‌లు, కోచింగ్‌ సెంటర్లు, క్రీడా సముదాయాలు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. వివాహాలు, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. దహన సంస్కారాలు మినహా పదిమంది కన్నా ఎక్కువ మందితో జరిగే ఏ కార్యక్రమానికైనా ప్రభుత్వ అనుమతి తప్పని సరిగా తీసుకోవాలని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఆ రిసెప్షన్‌కి అంత మంది ఎలా వచ్చారో తనకు అర్థం కావడంలేదని పెళ్లి కొడుకు వాపోతున్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని