PM Modi: ప్రధానికి బాలిక పంపిన గిఫ్ట్‌ ఏంటో తెలుసా..?

తాజా వార్తలు

Published : 03/09/2021 23:50 IST

PM Modi: ప్రధానికి బాలిక పంపిన గిఫ్ట్‌ ఏంటో తెలుసా..?

దిల్లీ: దేశవ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయం ఆవశ్యకతను ప్రచారం చేయాలనే ఉద్దేశంతో కేరళకు చెందిన ఓ బాలిక ప్రధాని నరేంద్ర మోదీకి ఓ బహుమతిని పంపించింది. దిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో భాజపా ఎంపీ సురేశ్‌ గోపి దానిని ప్రధానికి అందజేశారు.

కేరళలోని పథనంతిట్ట జిల్లాకు చెందిన జయలక్ష్మి అనే బాలిక పదో తరగతి చదువుతోంది. ఆమె తన ఇంటి ప్రాంగణంలో సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకుగానూ రాష్ట్ర ప్రభుత్వం ఆమెను ‘కర్షక తిలకం’ అనే అవార్డుతో సత్కరించింది. ఈ సాగు గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఆమె తన క్షేత్రంలో పెంచిన జామ మొక్కను ప్రధానికి పంపించాలనుకుంది. నేరుగా ఆయనను కలిసే వీలులేక.. దిల్లీలో సమావేశాలకు వెళ్తున్న ఎంపీ సురేశ్‌ గోపీకి ఇచ్చింది. ఆయన ప్రధానికి ఆ మొక్కను అందజేసి, బాలిక పంపిన విషయాన్ని వివరించారు. అంతేకాకుండా ప్రధానితో దిగిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. ‘సేంద్రియ సాగును ప్రచారం చేయాలని జయలక్ష్మి పంపిన జామ మొక్కను ప్రధాని మనస్ఫూర్తిగా స్వీకరించారు. అది ప్రధాని నివాసంలో పెరగడానికి సిద్ధంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని