గుజరాత్‌ సీఎంకు కరోనా

తాజా వార్తలు

Published : 15/02/2021 14:09 IST

గుజరాత్‌ సీఎంకు కరోనా

గాంధీనగర్‌: ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురై సభా వేదికపైనే కుప్పకూలిన గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీకి కరోనా సోకింది. అనారోగ్యంతో ఆదివారం ఆసుపత్రిలో చేరిన ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. 

వడోదరలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న రూపానీ.. సభలో ప్రసంగిస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో ఆయన పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది సీఎంను పట్టుకుని వేదికపైనే ప్రథమ చికిత్స అందించారు. అనంతరం విమానంలో అహ్మదాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ రూపానీని పరీక్షించిన వైద్యులు 24 గంటలు పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. ఆయనకు వైరస్‌ లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

గుజరాత్‌లోని వడోదర సహా ఆరు మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 21న, మున్సిపాలిటీలు, జిల్లాలు, తాలుకా పంచాయతీలకు ఫిబ్రవరి 28న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న రూపానీ.. ఆదివారం ఒక్కరోజే మూడు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. గత రెండు రోజులుగా సీఎంకు ఆరోగ్యం సరిగా లేదని, అయినప్పటికీ ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని భాజపా నేత ఒకరు చెప్పారు. 

ఇవీ చదవండి..

మహారాష్ట్రలో మళ్లీ కరోనా విజృంభణ

నెమ్మదించిన కొవిడ్‌..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని