Corona: వేరియంట్‌ ఏదైనా.. ఎదుర్కొనే అస్త్రాలివే!
close

తాజా వార్తలు

Published : 24/06/2021 00:57 IST

Corona: వేరియంట్‌ ఏదైనా.. ఎదుర్కొనే అస్త్రాలివే!

దిల్లీ: కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పడుతుండటంతో కాస్త ఉపశమనం కలుగుతున్న వేళ డెల్టా ప్లస్‌ వేరియెంట్‌ కలవర పెడుతోంది. దేశంలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ చాపకింద నీరులా వ్యాపిస్తుండటం, థర్డ్‌వేవ్‌ ముప్పు ఉందన్న ఆందోళనల నేపథ్యంలో దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ వేరియంట్‌ వ్యాప్తిని నియంత్రించాలన్నా కొవిడ్‌ నిబంధనలు పాటించడంతో పాటు లాక్‌డౌన్‌, వ్యాక్సినేషనే కీలకమన్నారు. కొత్తగా వస్తున్న కేసులను నిశితంగా గమనిస్తూ థర్డ్‌వేవ్‌కు దారితీయకుండా మరింత జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందని చెప్పారు. పెద్ద ఎత్తున పరీక్షలు చేయడంతో పాటు రోగులను ట్రాక్‌ చేయడం, భారీగా వ్యాక్సినేషన్‌ చేపట్టడం ద్వారా వ్యాప్తిని కట్టడి చేయగలమన్నారు.

ఏ వేరియంట్‌ అయినా సరైన జాగ్రత్తలను పాటించడం ద్వారానే వ్యాప్తిని నియంత్రించవచ్చని గులేరియా సూచించారు. లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌, ప్రొటోకాల్స్‌ పాటించడమే ఏ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకైనా అసలైన ఆయుధాలు అని తెలిపారు. థర్డ్‌వేవ్‌ రాకుండా తప్పించుకొనేందుకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పాఠశాలలను తెరవడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పిల్లలకు సంబంధించిన టీకాలపై ట్రయల్స్‌ జరుగుతున్నాయని, ఈ వ్యాక్సిన్ల సమాచారం సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ నాటికి తెలుస్తుందని పేర్కొన్నారు. వైరస్‌ నిరంతరం మ్యుటేషన్‌ చెందుతూ ఉంటుందన్నారు. వీటిలో చాలా వరకు వేరియంట్ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌గానే ఉంటాయని, పెద్ద ఎత్తున వ్యాప్తి చెందినప్పుడే అది ఆందోళనకర వేరియంట్‌ అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఫైజర్‌ చర్చలు జరుపుతోందని, త్వరలోనే ఆ టీకా మన దేశానికి వచ్చేలా  ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్టు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని