అప్పుడు గర్భధారణ వాయిదా వేయడమే మేలు!

తాజా వార్తలు

Published : 30/01/2021 14:21 IST

అప్పుడు గర్భధారణ వాయిదా వేయడమే మేలు!

సూచించిన భారతీయ వైద్య నిపుణులు 

దిల్లీ: కరోనా వైరస్‌ను నియంత్రించే లక్ష్యంతో భారత ప్రభుత్వం భారీ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది నిర్విఘ్నంగా కొనసాగుతుండటంతో ఇప్పటివరకు 30 లక్షల మందికి పైగా టీకాలు తీసుకున్నారు. అయితే ఈ టీకా తీసుకోవాలనుకునే మహిళలు పాటించాల్సిన జాగ్రత్తల గురించి దేశంలోని గైనకాలజిస్టులు, వైద్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. 

అత్యంత ప్రమాదం పొంచి ఉంటే తప్ప గర్భధారణ సమయంలో కరోనా టీకాలు తీసుకోవద్దని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇప్పటివరకు గర్భిణీలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకపోవడంతో ఈ సూచన చేసింది. కాగా, గర్భిణీలు, సంతానం కోసం వేచిచూస్తున్న వారికి భారతీయ వైద్య నిపుణులు కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. కరోనా వైరస్ టీకా తీసుకున్న జంటలు రెండు నెలల తరవాతే సంతానం కోసం ప్రణాళికలు వేసుకోవాలని సూచిస్తున్నారు. ‘గర్భం ధరించి ఉన్న సమయంలో టీకా తీసుకోవాలా వద్దా అనే దానిపై నిపుణులను సంప్రదించాలి. వారు వెల్లడించిన ప్రయోజనాలు, ప్రమాదాలను పరిగణనలోకి తీసుకొని ఓ నిర్ణయం తీసుకోవాలి’ అని ఓ ప్రముఖ వైద్యుడు  వెల్లడించారు. అయితే టీకా తీసుకోవడానికి ముందు ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయించుకోవాలని, అలాగే టీకా తీసుకున్న తరవాత గర్భధారణకు రెండు నెలల పాటు వేచి చూడాలని మాత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తావించలేదు. 

ఇదిలా ఉండగా..గర్భిణీలు, పాలిచ్చే తల్లులను కొవిడ్ క్లినికల్ ట్రయల్స్‌లో భాగం చేయలేదని ఇటీవల కేంద్రం కూడా వెల్లడించింది. ఈ సమయంలో వారు టీకా తీసుకోకపోవడమే మంచిదని అభిప్రాయపడింది. ఈ విభాగానికి చెందిన మహిళలపై టీకా ప్రభావానికి సంబంధించి దీర్ఘకాలిక సమాచారం అందుబాటులో లేకపోవడంతో వైద్యులు ఈ సూచన చేస్తున్నారు. అలాగే కొన్ని టీకాల్లో యాక్టివ్‌ వైరస్‌ను వాడుతుండటంతో..ఇది పిండానికి హాని కలిగించే అవకాశం ఉండొచ్చని వెల్లడించారు. అయితే, కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌లో ఇనాక్టివ్ వైరస్‌నే వాడుతున్నప్పటికీ.. వైద్యుల సూచనలు పాటించాలని చెప్తున్నారు.

ఇదీ చదవండి:

కరోనా కేసుల్లో 30 శాతం తగ్గుదల


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని