సచిన్‌ వాజే గురించి అప్పుడే హెచ్చరించా!

తాజా వార్తలు

Published : 29/03/2021 16:42 IST

సచిన్‌ వాజే గురించి అప్పుడే హెచ్చరించా!

శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ విమర్శలు

ముంబయి: ముంబయి పోలీసు అధికారి సచిన్‌ వాజే వల్ల మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వానికి సమస్యలు ఎదురవుతాయని తానెప్పుడో హెచ్చరించానని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తెలిపారు. వాజే ఉదంతం మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వానికి మంచి పాఠం నేర్పిందని అన్నారు. 

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల వాహనం కేసులో అరెస్టయిన సచిన్‌ వాజే.. ప్రస్తుతం ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ టీవీ ఛానల్‌తో రౌత్‌ మాట్లాడుతూ.. ‘‘వాజేను మళ్లీ మహారాష్ట్ర పోలీసు శాఖలోకి తీసుకోవాలని అనుకున్నప్పుడే అతడి గురించి నేను పార్టీలోని కొందరు నేతలకు సమాచారమిచ్చా. అతడి ప్రవర్తన, పనితీరు వల్ల ప్రభుత్వానికి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించా.  నేను కొన్ని దశాబ్దాల పాటు జర్నలిస్టుగా పనిచేశా. అందువల్ల వాజే గురించి నాకు తెలుసు. ఒక వ్యక్తి స్వతహగా చెడ్డవాడు కాదు. కొన్ని సార్లు పరిస్థితులు అతడిని అలా మారుస్తాయి. అయితే వాజే ఉదంతం, తాజా వివాదాలు.. సంకీర్ణ ప్రభుత్వానికి మంచి పాఠం నేర్పాయి’’ అని చెప్పుకొచ్చారు. 

ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌ రహస్య భేటీపై వస్తున్న వార్తల గురించి అడగ్గా.. ‘‘అందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? ప్రత్యర్థి పార్టీల నేతల చర్చలు మంచివే. వారి భేటీ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు’’అని అన్నారు. ఇక ఎన్సీపీ నేత అనిల్‌ దేశ్‌ముఖ్‌ యాదృచ్ఛిక హోంమంత్రి అంటూ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. ఆయనో జెంటిల్‌మన్‌ అంటూ సమాధానం దాటవేశారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని