Haiti: హైతీలో ఆకలి కేకలు.. ప్రస్తుత పరిస్థితికి నిదర్శనం ఈ దృశ్యాలు

తాజా వార్తలు

Published : 21/08/2021 23:58 IST

Haiti: హైతీలో ఆకలి కేకలు.. ప్రస్తుత పరిస్థితికి నిదర్శనం ఈ దృశ్యాలు

పోర్టౌ ప్రిన్స్‌: కరీబియన్ ద్వీప దేశమైన హైతీలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 14న సంభవించిన భారీ భూకంపంతో సర్వస్వం కోల్పోయిన ప్రజలు పొట్టచేత పట్టుకుని రోడ్లపైకి వచ్చారు. అసలే పేద దేశం.. ఆపై వరుస విపత్తులు హైతీని కోలుకోలేని దెబ్బ తీశాయి. నిత్యావసరాలు అందించేందుకు వచ్చిన ఓ ట్రక్కు వద్దకు భారీగా చేరుకున్న ప్రజలు దొరికిన కాడికి దోచుకెళ్లారు. గుంపులుగుంపులుగా ట్రక్కుపైకి ఎగబడిన జనం నిత్యావసరాల కోసం పోటీపడ్డారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ తలెత్తింది. సరకుల కోసం జనం కొట్టుకున్నారు. దీంతో అక్కడి నుంచి ట్రక్కును తీసుకెళుతుండగా దాని వెంట పరుగులు తీశారు.

హైతీలో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 2వేలు దాటింది. ఈ ఘోర విపత్తులో మరో 10వేల మందికిపైగా గాయపడ్డారు. భూకంప తీవ్రతకు వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతినగా  వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భూకంపం తర్వాత హైతీలో ఎటుచూసినా  హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఈ విపత్తుతో ఆహార అభద్రత మరింత పెరిగిపోయింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని