Prince Harry: హ్యారీ దంపతులకు ఆడబిడ్డ 

తాజా వార్తలు

Updated : 07/06/2021 06:41 IST

Prince Harry: హ్యారీ దంపతులకు ఆడబిడ్డ 

లిలీబెట్‌ డయానాగా నామకరణం

లండన్‌: బ్రిటన్‌ యువరాజు హ్యారీ భార్య మేఘన్‌ మార్కెల్‌ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. నవజాత శిశువుకు లిలీబెట్‌ డయానా మౌంట్‌బాటన్‌ విండ్సార్‌ అని నామకరణం చేశారు. శుక్రవారం కాలిఫోర్నియా(అమెరికా)లోని శాంటా బార్బరా కాటేజ్‌ ఆసుపత్రిలో లిలీబెట్‌ జన్మించినట్లు హ్యారీ, మేఘన్‌ దంపతులు ఆదివారం ప్రకటించారు. ఈ దంపతులకు ఇది రెండో సంతానం. తొలి సంతానమైన అబ్బాయి ఆర్చీ వయసు 2 సంవత్సరాలు. లిలీబెట్‌.. బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ ముద్దుపేరు. హ్యారీ తల్లి పేరు డయానా. ఆమె 1997లో జరిగిన కారు ప్రమాదంలో చనిపోయారు.  ప్రస్తుతం హ్యారీ, మేఘన్‌ బ్రిటన్‌ రాజకుటుంబం నుంచి తెగదెంపులు చేసుకొని అమెరికాలో ఉంటున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని