ప్రతి ఒక్కరికీ టీకా ఇవ్వాల్సిన పనిలేదు

తాజా వార్తలు

Updated : 19/03/2021 15:13 IST

ప్రతి ఒక్కరికీ టీకా ఇవ్వాల్సిన పనిలేదు

వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

దిల్లీ: కరోనా టీకాకు సంబంధించి ఎలాంటి అపోహలు అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ లోక్‌సభ వేదికగా మరోసారి భరోసా ఇచ్చారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 

‘ప్రతి టీకాకు యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ అవసరం లేదు. మొదట వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, తరవాత 60ఏళ్లు పైబడిన(45ఏళ్లు దాటి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి)వారికి టీకాలు అందిస్తున్నాం. నిపుణుల సూచనల ఆధారంగా రానున్న రోజుల్లో టీకా కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తాం. భారతీయ నిపుణులతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణులతో కూడా సంప్రదింపులు జరిపాం’ అని హర్షవర్ధన్ వెల్లడించారు.

‘వైద్య నిపుణులు చెప్పిన సూచనలు ప్రకారం..దేశంలో ప్రతి ఒక్కరికీ టీకా ఇవ్వాల్సిన పని లేదు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా. వైరస్ తీరును బట్టి..టీకా కార్యక్రమంలో మార్పులు ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరు టీకాకు సంబంధించి ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు’ అని మంత్రి అన్నారు. ఈ కరోనా టీకా కార్యక్రమం కింద ఇప్పటివరకు 3,93,39,817 మందికి కేంద్రం టీకాలు పంపిణీ చేసింది. జనవరి 16న ఈ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే అర్హులైన కొందరిలో నెలకొన్న భయాలు, ఒకసారి టీకా వయల్‌ను ఓపెన్ చేసిన వెంటనే నిర్దేశిత సమయంలో అందించాల్సి రావడం వంటి పరిమితుల కారణంగా టీకా వృథా అవుతోంది. స్వయంగా ప్రధానే దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని