Covid: యాంటీబాడీ కాక్‌టెయిల్ తొలి డోసు ఈయనకే

తాజా వార్తలు

Published : 27/05/2021 11:25 IST

Covid: యాంటీబాడీ కాక్‌టెయిల్ తొలి డోసు ఈయనకే

గురుగ్రామ్‌: కరోనా చికిత్సలో యాంటీబాడీ కాక్‌టెయిల్‌ను దేశంలో తొలిసారిగా వినియోగించారు. హరియాణాకు చెందిన 82 ఏళ్ల కొవిడ్ బాధితుడికి రెండు రోజుల క్రితం తొలి డోసు ఇవ్వగా.. ఆయన వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రి మేదాంతా ఛైర్మన్‌ డాక్టర్‌ నరేశ్‌ త్రెహాన్‌ వెల్లడించారు. అయితే డిశ్చార్జ్‌ అయినప్పటికీ.. ఆ రోగిని ప్రతి రోజూ పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు.

‘‘కాసిరివిమాబ్‌‌, ఇమ్డెవిమాబ్‌ అనే రెండు రకాల యాంటీబాడీలను కలిపి తొలి దశలోనే కరోనా బాధితులకు ఇచ్చినట్లయితే.. ఇవి వైరస్‌ కణాలను శరీరమంతా వ్యాపించకుండా అడ్డుకుంటాయి. కొవిడ్‌ 19, బి.1.617 రకం వేరియంట్‌పై ఇది సమర్థంగా పనిచేస్తోంది. ఈ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ద్వారా రోగులు ఆసుపత్రికి వెళ్లే అవసరం 70శాతం తగ్గిపోతుంది. మన దగ్గర తొలి డోసును హరియాణాకు చెందిన వ్యక్తికి ఇచ్చాం. డోసు తీసుకున్న మరుసటి రోజు ఆయనను డిశ్చార్జ్‌ చేశాం. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తాం. మహమ్మారిపై ఇది మన కొత్త ఆయుధం లాంటిది’’అని డాక్టర్‌ నరేశ్‌ త్రెహాన్‌ వివరించారు. 

కొవిడ్ వైరస్‌ను ఎదుర్కొనే రెండు యాంటీబాడీలను కలిసి ఈ ఔషధాన్ని అభివృద్ధి చేశారు. ఇటీవల భారత కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపిన ఈ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ను ఇటీవల రోచ్‌ఇండియా, సిప్లా సంయుక్తంగా భారత మార్కెట్లో విడుదల చేశాయి. దీనిక ధర డోసుకు రూ. 59,750గా పేర్కొన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గతేడాది కరోనా బారిన పడినట్లు ఈ ఔషధాన్ని తీసుకుని వైరస్‌ నుంచి కోలుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని