close

తాజా వార్తలు

Published : 30/11/2020 17:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అక్కడ 75 శాతం మందిలో యాంటీబాడీలు

 

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని కఫే పరేడ్ ప్రాంతంలోని ఐదు మురికివాడల్లో నిర్వహించిన సీరో సర్వేలో ఆశ్చర్యకర ఫలితాలు వెల్లడయ్యాయి. ఆ ప్రాంతంలోని 75 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో ఇదే అత్యధిక సీరో ప్రివలెన్స్ రేటు కావడం గమనార్హం. ఐబెట్స్‌ ఫౌండేషన్‌, భాజపా కార్పొరేటర్ హర్షిత నర్వేకర్ ఆధ్వర్యంలో ఈ సర్వే నిర్వహించారు. 806 మంది బాధితులను పరీక్షించగా, 605 మందిలో కరోనా యాంటీ బాడీలు ఉన్నట్లు గుర్తించారు. ఒక శాతం క్రియాశీల కేసులను కూడా గుర్తించారు.

గతంలో బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిర్వహించిన  సర్వేలో మురికివాడలోని 45 శాతం మందిలో, ఇతరుల్లో 18 శాతం మందిలో యాంటీ బాడీలు ఉన్నట్లు వెల్లడైంది. బీఎంసీ నిర్వహించని ఐదు మురికివాడల్లో అక్టోబర్ 5 నుంచి 10 తేదీవరకు ఈ సర్వే నిర్వహించినట్లు ఐబెట్స్ ఫౌండేషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. 806 మందిలో గతంలో ఎనిమిది మందికి మాత్రమే కొవిడ్-19 పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడించడం గమనార్హం. అయితే, గతంలో వైరస్ బారిన పడినవారు ఆ విషయాన్ని వెల్లడించడానికి ముందుకు రాకపోవడమో లేక లక్షణాలు లేని వ్యాప్తి వలనో ..పాజిటివ్ కేసులు బయటపడకపోయుండొచ్చని ఆ ఫౌండేషన్ అంచనా వేసింది. గతంలో ఎప్పుడైనా వైరస్ సోకిందా? అనే ప్రశ్నకు 31 మంది సమాధానం ఇవ్వడానికి ఇష్టపడలేదని కూడా తెలిపింది. అంతేకాకుండా, 18-40 వయసున్న 78శాతం, 40-60 వయసున్న 76 శాతం, 60 
సంవత్సరాల పైబడిన 76 శాతం మందిలో యాంటీబాడీలను గుర్తించినట్లు పేర్కొంది. అలాగే సీరోప్రివలెన్స్ రేటు పురుషులతో పోల్చుకుంటే మహిళల్లో అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. 

కాగా, టీకా పంపిణీ గురించి చర్చలు జరుగుతున్న తరుణంలో ప్రాధాన్య క్రమంలో టీకా ఇచ్చేందుకు మా సర్వే సహకరిస్తుందని నర్వేకర్ అభిప్రాయపడ్డారు. అలాగే యాంటీబాడీలు ఉన్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ అందరు మాస్కులు, భౌతిక దూరం తప్పక పాటించాలని అభ్యర్థించారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని