హాంకాంగ్‌లో తొలిసారి కఠిన ఆంక్షలు!

తాజా వార్తలు

Published : 23/01/2021 23:55 IST

హాంకాంగ్‌లో తొలిసారి కఠిన ఆంక్షలు!

హాంకాంగ్‌ : కరోనా కట్టడి కోసం హాంకాంగ్‌ తొలిసారి కఠిన నిర్ణయం తీసుకుంది. వేలాది మందిని లాక్‌డౌన్‌లో ఉండాలని ఆదేశించింది. గత రెండు వారాల్లో దాదాపు 4,300 కరోనా కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ విధించిన సమయంలోనూ హాంకాంగ్‌ ఆంక్షల అమలుకు వెనుకాడింది. కానీ, తాజాగా వైరస్‌ కేసులు భారీ స్థాయిలో నమోదవుతుండడంతో కఠిన చర్యలకు ఉపక్రమించక తప్పలేదు.

హాంకాంగ్‌లోని యౌ సిమ్‌ మోంగ్‌ జిల్లాలో వర్కింగ్‌ క్లాస్‌ నివసించే భవన సముదాయాల్లో భారీ స్థాయిలో కేసులు నమోదవుతన్నాయి. గతవారం నమోదైన కేసుల్లో సగానికి పైగా ఈ ప్రాంతంలోనే వెలుగు చూశాయి. ఇక్కడి మురుగునీటిని పరీక్షించగా.. భారీ స్థాయిలో కరోనా వైరస్‌ ఆనవాళ్లను గుర్తించారు. డ్రైనేజీ వ్యవస్థలో లోపాలు, భవన సముదాయాల్లో పెద్దగా వెలుతురు లేకపోవడం వంటి కారణాల వల్లే వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని నిర్ధారణకు వచ్చారు. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలోని 16 భవనాల్లో ప్రతి ఒక్కరూ కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని ఆదేశించారు. అప్పటి వరకు ఎవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశించారు.

జులైలో హాంకాంగ్‌లో లాక్‌డౌన్‌ విధించేందుకు అక్కడి ప్రభుత్వాధినేత కేరీ లామ్‌ నిరాకరించారు. అత్యవసరమై మరో ప్రత్యామ్నాయం లేకపోతే తప్ప అలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోబోమని ప్రకటించారు. తాజాగా విధించిన ఆంక్షలు 48 గంటల పాటు అమల్లో ఉండనున్నాయి. అప్పటి వరకు నిర్ధారణ పరీక్షలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు హాంకాంగ్‌లో 9,929 కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరిలో 168 మంది మరణించారు.

ఇవీ చదవండి...

కొత్త రకం కరోనాతోనే అధిక మరణాలు!

టీకాపై రాజకీయాలను పట్టించుకోలేదు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని