జూన్‌కల్లా కొవొవాక్స్‌ టీకా: పూనావాలా

తాజా వార్తలు

Updated : 30/01/2021 15:27 IST

జూన్‌కల్లా కొవొవాక్స్‌ టీకా: పూనావాలా

పుణె: దేశంలో మరో టీకాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రముఖ టీకా తయారీదారు సీరం ఇన్‌స్టిట్యూట్‌ సిద్ధమవుతోంది. ఈ ఏడాది జూన్‌కల్లా ‘కొవొవాక్స్‌’ టీకాను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీరం సీఈవో అదర్‌ పూనావాలా తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ట్వీట్‌ చేశారు. ‘‘ నోవావాక్స్‌ సంస్థ అభివృద్ధి చేసిన ‘కొవొవాక్స్‌’ వ్యాక్సిన్‌ మంచి ఫలితాలనిస్తోంది. భారత్‌లో ట్రయల్స్‌ కోసం ఇప్పటికే అనుమతులు కోరాం. కొవొవాక్స్‌ను జూన్‌ కల్లా అందుబాటులోకి తీసుకొస్తామని ఆశిస్తున్నాం.’’ అని అదర్‌ పూనావాలా ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘కొవొవాక్స్‌’ టీకాపై భారత్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు సీరం సిద్ధమైంది. దీనిని అమెరికాకు చెందిన నోవావాక్స్‌ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు కోరినట్లు సీరం సంస్థ శుక్రవారం తెలిపింది.

కాగా ఈ కొవొవాక్స్‌ టీకా సామర్థ్యం 95.6 శాతంగా తేలినట్లు సీరం సంస్థ గతంలో ప్రకటించింది. నోవావాక్స్‌ సంస్థతో గతంలోనే ఒప్పందం కుదుర్చుకున్న సీరం ఏప్రిల్‌ నుంచి నెలకు 40-50 మిలియన్ల డోసులను ఉత్పత్తి చేస్తామని ప్రకటించింది. ఈ వ్యాక్సిన్‌ యూకే రకం వైరస్‌ను కూడా సమర్థవంతంగా కట్టడి చేయగలదని ప్రాథమిక విశ్లేషణలో వెల్లడైనట్లు వారు తెలిపారు. ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్‌ - ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకాను సీరం భారత్‌లో ఉ‌త్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..

దిల్లీ పేలుడు.. వారి పనేనా?

అప్పుడు గర్భధారణ వాయిదా వేయడమే మేలు..Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని