Kerala: షాకింగ్‌.. వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన ఇల్లు

తాజా వార్తలు

Updated : 19/10/2021 04:15 IST

Kerala: షాకింగ్‌.. వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన ఇల్లు

తిరువనంతపురం: భారీ వర్షాలు దక్షిణాది రాష్ట్రం కేరళలో బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎటు చూసిన వరదనీటితో పలు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు కొట్టాయం, ఇడుక్కి జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వరద ప్రవాహానికి ఏకంగా ఓ ఇల్లే కొట్టుకుపోయిందంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. కొట్టాయంలోని ముందకాయం ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

భారీ వర్షాలకు ముందకాయం ప్రాంతంలోని మణిమాల నదికి వరద నీరు పోటెత్తింది. దీంతో నది ఉగ్రరూపం దాల్చి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నది ఒడ్డున ఓ ఇల్లు ఉంది. అయితే వరద ప్రవాహం పెరగడంతో చూస్తుండగానే ఈ ఇల్లు నదిలో కుప్పకూలి కొట్టుకుపోయింది. ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ముప్పును గుర్తించిన అధికారులు ముందుగానే ఆ ఇంట్లోని వారిని అక్కడి నుంచి తరలించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ భయానక దృశ్యాలను కొందరు వీడియో తీయగా ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

భారీ వర్షాల కారణంగా కేరళలో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో ఆదివారం నాటికి మృతుల సంఖ్య 26కు పెరిగింది. వీరిలో ఒక్క కొట్టాయం జిల్లా వాసులే 13 మంది. ఇడుక్కి జిల్లాలో తొమ్మిది మంది, అలప్పుజలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఇంకా కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సైన్యం, జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌), పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.




Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని