close

తాజా వార్తలు

Updated : 01/03/2021 11:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘కొవిన్‌’.. నమోదు ఇలా

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా మహమ్మారిని తరిమికొట్టే బృహత్తర కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా రెండోదశ టీకా పంపిణీ సోమవారం ప్రారంభమైంది. 60ఏళ్లు పైబడిన వారికి, 45-59 ఏళ్ల మధ్యవయస్కుల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఈ దశలో వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. అయితే, టీకా తీసుకోవాలనుకునేవారు ముందుగా ‘కొవిన్‌’ పోర్టల్‌లో తమ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నేటి ఉదయం నుంచి ఈ పోర్టల్‌ అందుబాటులోకి వచ్చింది. యాప్‌లో నమోదు ప్రక్రియ అవకాశం ప్రస్తుతానికి అడ్మినిస్ట్రేటర్లకు మాత్రమే ఉందని ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 

కొవిన్‌లో పేరు నమోదు ప్రక్రియ ఎలాగంటే..

1. www.cowin.gov.in లో పేరు నమోదు చేసుకోవచ్చు.

2. కొవిన్‌వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత అందులో Register Yourself అనే బటన్‌ ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేసి మొబైల్‌ నంబరు రాస్తే మన ఫోన్‌కు ఒక ఓటీపీ వస్తుంది. 

3. ఆ ఓటీపీని ఎంటర్‌ చేస్తే రిజిస్ట్రేషన్‌ పేజీకి వెళ్తుంది. అక్కడ మీ పేరు, వయసు, పుట్టినతేదీ వంటి వివరాలు ఎంటర్‌ చేయాలి. దీంతో పాటు ఏదో ఒక ధ్రువీకరణ పత్రం (డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, ఓటరు కార్డు, ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు తదితర)ఎంచుకుని దాన్ని అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

4. ఆ తర్వాత మీకు దీర్ఘకాల వ్యాధులు ఉన్నాయో లేదో అని అడుగుంది. 45 నుంచి 60ఏళ్ల లోపు వారైతే వ్యాధిని నిర్ధారించే డాక్టర్‌ సర్టిఫికేట్‌ను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

5. ఇలా అన్ని వివరాలు నింపిన తర్వాత రిజిస్టర్‌ బటన్‌పైన క్లిక్‌ చేయాలి. 

6. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత మీ అకౌంట్‌ వివరాలను చూపిస్తుంది. ఆ తర్వాత కుటుంబసభ్యుల వివరాలు కూడా యాడ్‌ చేసుకోవచ్చు. 

7. ఒక వ్యక్తి ఒక మొబైల్‌ నంబరు మీద గరిష్ఠంగా ముగ్గురు వ్యక్తులను యాడ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ‘యాడ్‌ మోర్‌’ బటన్‌ను క్లిక్‌ చేయాలి.

8. ఆ తర్వాత టీకా కోసం అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకోవాలి. ‘Schedule appointment’ అని బటన్‌ క్లిక్‌ చేస్తే అపాయింట్‌మెంట్‌ పేజీకి వెళ్తుంది. అక్కడ మన రాష్ట్రం, జిల్లా, పిన్‌కోడ్‌ ఎంటర్‌ చేసి మనకు సమీపంలోని టీకా పంపిణీ కేంద్రాలను తెలుసుకోవచ్చు. ఆ జాబితా నుంచి ఒక కేంద్రాన్ని ఎంచుకుంటే అందుబాటులో ఉన్న స్లాట్స్‌ చూపిస్తుంది. వాటిలో నుంచి సమయం, తేదీని ఎంచుకుని కింద ఉండే Book బటన్‌ను క్లిక్‌ చేస్తే అపాయింట్‌మెంట్‌ లభిస్తుంది. 

9. అవసరమైతే టీకా తేదీ, సమయాన్ని మార్చుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అయితే, దీన్ని అపాయింట్‌మెంట్‌ తీసుకున్న తేదీ కంటే ముందే మార్చుకోవాలి. సిటిజన్‌ రిజిస్ట్రేషన్‌లో లాగిన్‌ అయితే రీషెడ్యూల్‌ ఆప్షన్‌ కన్పిస్తుంది. 

మరిన్ని వివరాలు..

* టీకా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వ్యాక్సిన్‌ ఇస్తారు. 

* తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవాలి. మొదటి డోసు తీసుకున్నప్పుడే రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలో తెలుస్తుంది. 

* రెండో డోసు తీసుకోవడం ద్వారా కొవిడ్‌ టీకా పొందినట్లుగా ధ్రువపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.

* టీకా పొందేప్పుడు నమోదు సమయంలో అప్‌లోడ్‌ చేసిన సంబంధిత ధ్రువపత్రాల ఒరిజినల్స్‌ను వెంట తీసుకెళ్లాలి. 

టీకా ఎవరెవరికి..

60ఏళ్లు పైబడిన అందరికీ టీకా వేస్తారు. ఇక 45-59ఏళ్ల మధ్యవయస్కుల్లో అందరికీ టీకా తీసుకునే అవకాశం లేదు. కేవలం 20 రకాల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మాత్రమే టీకా తీసుకోవచ్చు. గుండెపోటుతో గతేడాది నుంచి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నవారు, తీవ్రమైన హృద్రోగాలు ఉన్నవారు, కరోనరీ ఆర్టెరీ డిసీజ్‌, సీటీ-ఎంఆర్‌ఐ స్ట్రోక్‌, 10ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్నవారు, అధిక రక్తపోటు, కిడ్నీ సంబంధ వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్‌ తదితర వ్యాధిగ్రస్తులు వ్యాక్సిన్‌ తీసుకునేందుకు అర్హులు. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని