Afghan Crisis: గాల్లో వేలాడుతూ ప్రయాణాలు.. విమాన చక్రాల్లో మానవ అవశేషాలు..!

తాజా వార్తలు

Published : 18/08/2021 13:50 IST

Afghan Crisis: గాల్లో వేలాడుతూ ప్రయాణాలు.. విమాన చక్రాల్లో మానవ అవశేషాలు..!

వాషింగ్టన్‌: ‘‘విమానం వెంట పరుగులు.. సీటు కోసం తోపులాటలు.. రెక్కలు పట్టుకుని ప్రయాణాలు’’.. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల రాజ్యంతో గత సోమవారం రాజధాని కాబుల్ విమానాశ్రయంలో కన్పించిన హృదయ విదారక దృశ్యాలివి. దేశాన్ని విడిచి వెళ్లేందుకు అఫ్గాన్‌ వాసులు ప్రాణాలనే పణంగా పెట్టడం యావత్‌ ప్రపంచాన్ని కదిలించింది. విమానంలో సీటు దొరక్క రెక్కలు, చక్రాలు పట్టుకుని వేలాడుతూ జారిపడి పలువురు మృతిచెందిన సంగతి తెలిసిందే. తాజాగా కాబుల్‌ నుంచి వెళ్లిన ఓ అమెరికా విమానం ల్యాండింగ్‌ గేర్‌ వద్ద చక్రాల్లో మానవ అవశేషాలు లభించడం.. నాటి భీతావాహ పరిస్థితులకు అద్దంపడుతోంది. 

కాబుల్‌ ఎయిర్‌పోర్టు నుంచి గత సోమవారం బయల్దేరిన యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌ సీ-17 విమానం ఒకటి మంగళవారం కతర్‌లోని అల్‌-ఉదైద్‌ ఎయిర్‌ బేస్‌లో ల్యాండ్‌ అయ్యింది. అక్కడ విమానాన్ని పరిశీలిస్తుండగా.. ల్యాండింగ్‌ గేర్‌ వీల్‌ వెల్‌లో మానవ అవశేషాలను గుర్తించారు. ఎలాగైనా దేశాన్ని విడిచి వెళ్లాలనే తొందరలో అఫ్గాన్‌ వాసులు కొందరు విమాన చక్రాలను పట్టుకుని ప్రమాదకరంగా ప్రయాణిస్తూ కన్పించారు. విమానం గాల్లో ఎగిరిన తర్వాత వారు చక్రాల్లో ఇరుక్కొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. లేదా విమానం టేకాఫ్‌ అవుతుండగా దాని విమానం కింద ఎవరైనా పడిపోయి ఉండొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌ వెల్లడించింది. ‘‘ఆ రోజు కాబుల్‌లో భద్రతా పరిస్థితులు క్షణక్షణానికి క్షీణిస్తుండటంతో వీలైనంత త్వరగా విమానాన్ని టేకాఫ్‌ చేయాని సీ-17 సిబ్బంది నిర్ణయించార’ని తెలిపింది. 

కాగా.. కాబుల్‌ ఎయిర్‌పోర్టుకు సంబంధించి మరో వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. అందులో ఒక విమానం రన్‌వేపై వెళ్తుండగా.. కొంతమంది అఫ్గాన్‌ యువకులు దాని ల్యాండింగ్‌ గేర్‌ డోర్‌పై కూర్చుని ప్రయాణిస్తూ కన్పించారు. సెల్‌ఫోన్‌లో ఈ వీడియో తీసినట్లుగా ఉంది. అయితే వారంతా సురక్షితంగా ల్యాండ్‌ అయ్యారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఎందుకంటే విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత వారు కూర్చోడానికి ఏమాత్రం పట్టు ఉండదు. అలా ఇద్దరు వ్యక్తులు విమానం నుంచి జారిపడిన వీడియోలు రెండు రోజుల కిందట వైరల్‌ అయిన విషయం తెలిసిందే.  

ఇదిలా ఉండగా.. కాబుల్‌ విమానాశ్రయంలో మంగళవారం పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయి. అమెరికా బలగాల పహారాలో అక్కడి నుంచి మిలటరీ తరలింపు విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే, రాత్రివేళ అక్కడకు చేరుకున్న తాలిబన్లు సాధారణ ప్రజలను ఎయిర్‌పోర్టులోకి రానివ్వ లేదు. ప్రహారి దూకి లోపలకు వచ్చేందుకు ప్రయత్నించినవారిపై కాల్పులు జరిపారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని