close

తాజా వార్తలు

Published : 28/02/2021 14:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హైదరాబాదీ రైతుపై మోదీ ప్రశంసలు

దిల్లీ: హైదరాబాద్‌కు చెందిన అభ్యుదయ రైతు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డికి మరో అరుదైన గౌరవం లభించింది. సంప్రదాయ పద్ధతుల్లో వెంకటరెడ్డి చేస్తున్న వ్యవసాయం గురించి ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌లో ప్రస్తావించారు. శాస్త్ర విజ్ఞానమంటే కేవలం భౌతిక, రసాయన శాస్త్రాలకు సంబంధించిన అంశం కాదన్న ప్రధాని.. ప్రయోగశాల నుంచి క్షేత్రస్థాయికి దానిని విస్తరించాలన్నారు. ఇందుకు నిదర్శనంగా రైతు వెంకటరెడ్డి గురించి ప్రస్తావించి సాగులో ఆ రైతు సృష్టించిన అద్భుతాలను వివరించారు. వరి, గోధుమల్లో విటమిన్‌-డి ఉండేలా వెంకటరెడ్డి ఫార్ములా రూపొందించారన్న ప్రధాని.. దానిపై ఇటీవలే సదరు రైతుకు పేటెంట్ హక్కు లభించిందని పేర్కొన్నారు. వెంకటరెడ్డి కృషిని గుర్తించి గతేడాది పద్మశ్రీతో ఆయనను గౌరవించినట్లు గుర్తుచేశారు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని