నా కూతురికేమైనా జరిగిందో..!: షరీఫ్‌‌ వార్నింగ్‌ 
close

తాజా వార్తలు

Published : 12/03/2021 21:07 IST

నా కూతురికేమైనా జరిగిందో..!: షరీఫ్‌‌ వార్నింగ్‌ 

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ సైన్యం తన కుమార్తెను బెదిరిస్తోందంటూ ఆ దేశ మాజీ ప్రధాని, పీఎంఎల్‌-ఎన్‌ చీఫ్‌ నవాజ్‌ షరీఫ్‌ ఆరోపించారు. తన కుమార్తె మారియంకు ఏదైనా జరిగితే.. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, సైన్యాధిపతులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న షరీఫ్‌ ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడటం మానుకోకపోతే మారియంను అంతం చేస్తామంటూ బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. 

కనీస గౌరవం కూడా లేకుండా దిగజారి కరాచీలోని మారియం ఉంటున్న హోటల్‌ తలుపులు బద్దలు కొట్టి వెళ్లారంటూ షరీఫ్‌ ఆరోపించారు. సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఆపకపోతే ఆమెను అంతం చేస్తామంటూ బెదిరించారన్నారు. తన కుమార్తెకు ఏదైనా జరిగితే ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ క్వమర్‌ జావేద్‌ భజ్వా, ఐఎస్‌ఐ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఫయాజ్‌ హమీద్‌, జనరల్‌ ఇర్ఫాన్‌ మాలిక్‌లే బాధ్యత వహించాలని వీడియోలో హెచ్చరించారు. అల్‌ అజిజ్‌ మిల్స్‌ అవినీతి కేసులో ఏడేళ్ల జైలు శిక్ష పడిన నవాజ్‌ షరీఫ్‌..2019 ఫిబ్రవరిలో వైద్యపరమైన కారణాలతో బెయిల్‌ తీసుకొని పాక్‌ ప్రభుత్వం అనుమతితో లండన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని