Farm laws: 22 నుంచి పార్లమెంట్ ఎదుట నిరసనలు

తాజా వార్తలు

Published : 11/07/2021 01:07 IST

Farm laws: 22 నుంచి పార్లమెంట్ ఎదుట నిరసనలు

దిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రంతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రైతు ఉద్యమ నేత, భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ తెలిపారు. అలాగే ఈ చట్టాలకు వ్యతిరేకంగా జులై 22 నుంచి పార్లమెంట్‌ ఎదుట నిరసనలు చేపట్టనున్నట్లు శనివారం మీడియాకు వెల్లడించారు. 

‘వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు కేంద్రం ముందుకు వస్తే.. అందుకు మేం కూడా సిద్ధంగా ఉన్నాం. జులై 22 నుంచి 200 మందితో కూడిన బృందం పార్లమెంటు సమీపంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది. అలాగే జనవరి 26న ఎర్రకోట ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తును కోరుకుంటున్నాం. ఇక్కడ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసే సంస్థ ఉందా? లేదంటే, ఐరాసకు వెళ్లాలా?’ అంటూ తికాయత్ మీడియాతో మాట్లాడారు. అలాగే తాము ఈ చట్టాలపై ఐరాస చెంతకు వెళ్తామని ఎన్నడూ అనలేదన్నారు. ఎర్రకోట ఘటనపై అడిగిన ప్రశ్నకు మాత్రమే తాము స్పందించామన్నారు.  

కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొద్ది నెలలుగా రైతులు ఉద్యమిస్తున్నారు. కేంద్రంతో పలు దఫాలు చర్చలు జరిగినా ఎలాంటి పరిష్కారం లభించకపోవడంతో ఇరు వర్గాల మధ్య ప్రతిష్టంభన అలాగే కొనసాగుతోంది. రైతులు ఇప్పటికీ దిల్లీ శివారులో తమ నిరసన కొనసాగిస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని