దేశంలో టాప్‌ విద్యాసంస్థ ఐఐటీ-దిల్లీనే!

తాజా వార్తలు

Updated : 26/11/2021 00:39 IST

దేశంలో టాప్‌ విద్యాసంస్థ ఐఐటీ-దిల్లీనే!

దిల్లీ: భారత్‌లో అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ-దిల్లీ నిలిచిందని, ఇందులో చదువుకున్న విద్యార్థులంతా ఉపాధి పొందగలుతున్నారని గ్లోబల్‌ ఎంప్లాయిబిలిటీ యూనివర్సిటీ ర్యాంకింగ్‌ అండ్‌ సర్వే(జీఈయూఆర్‌ఎస్‌) వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక విద్యార్థులు ఉపాధి పొందుతున్న 250 యూనివర్సిటీ/విద్యాసంస్థల జాబితాను జీఈయూఆర్‌ఎస్‌ తాజాగా విడుదల చేసింది. అందులో భారత్‌ నుంచి ఏడు విద్యాసంస్థలు స్థానం దక్కించుకోవడం విశేషం. 

ఈ జాబితాలో మొదటి ర్యాంక్‌ మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఉండగా.. రెండో ర్యాంక్‌ కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి, మూడో ర్యాంక్‌ హార్వర్డ్‌ యూనివర్సిటీకి దక్కింది. భారత విద్యాసంస్థల్లో ఐఐటీ-దిల్లీ 27వ ర్యాంక్‌లో నిలిచింది. టాప్‌ 100 యూనివర్సిటీ/విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ-దిల్లీతోపాటు ఐఐఎస్‌సీ-బెంగళూరు(61వ ర్యాంక్‌), ఐఐటీ-బాంబే(97వ ర్యాంక్‌)ఉన్నాయి. ఇక మొత్తం 250 వర్సిటీల జాబితాలో ఐఐఎం-అహ్మదాబాద్‌కు 162వ ర్యాంక్‌, ఐఐటీ-ఖరగ్‌పూర్‌కు 170వ ర్యాంక్‌, అమిటీ యూనివర్సిటీకి 225వ ర్యాంక్‌, బెంగళూరు యూనివర్సిటీకి 249వ ర్యాంకు దక్కాయి. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది భారతీయ యూనిర్సిటీలు మెరుగైన ర్యాంకులు సాధించినట్లు తెలుస్తోంది. 

వివిధ కంపెనీలు సంప్రదాయ చదువులకే కాకుండా.. డిజిటల్‌, సాఫ్ట్‌వేర్‌ నైపుణ్యాలకు ఉద్యోగ నియమాకాల్లో ప్రాధాన్యత ఇస్తున్నాయి. అలాగే, యూనివర్సిటీ పేరు.. ప్రఖ్యాతలను దృష్టిలో పెట్టుకోకుండా కేవలం డిజిటల్‌ అక్షరాస్యత, ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు ఉన్నవారికే కంపెనీలు ఉద్యోగాలు ఇస్తున్నాయి. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని