పండగల వేళ.. ఆంక్షలు తప్పనిసరి..!

తాజా వార్తలు

Published : 24/03/2021 20:40 IST

పండగల వేళ.. ఆంక్షలు తప్పనిసరి..!

రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం..

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ రోజురోజుకీ విజృంభిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో ఆంక్షలు విధించడాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. రానున్న పండగలు, ఉత్సవాల దృష్ట్యా వివిధ రాష్ట్రాలు కొవిడ్‌ ఆంక్షలు విధించడంపై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కోరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ ప్రకటన జారీ చేసింది. ‘ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి.  పండగలు రానున్న సందర్భంగా.. వీటి నిర్వహణపై ఆంక్షలు విధించడాన్ని రాష్ట్రాలు పరిశీలించాలి. నియమాలకు లోబడి పండుగలు, ఉత్సవాలు నిర్వహించేలా.. ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కొవిడ్‌ ఉద్ధృతి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో పండగలు, ఉత్సవాల నిర్వహణను పరిమితం చేయాలి. దేశంలో కరోనా కట్టడికి అందరూ సహకరించాలి. బహిరంగ ప్రదేశాలలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం వైరస్‌ వ్యాప్తికి కారణమవుతోంది’ అని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటనలో పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని