Gaza conflict: ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరు

తాజా వార్తలు

Published : 29/05/2021 01:40 IST

Gaza conflict: ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇజ్రాయెల్‌-గాజా మధ్య 11రోజుల సైనిక ఘర్షణలో యుద్ధనేరాల ఉల్లంఘనలపై దర్యాప్తు కోరుతూ ఐరాస మానవహక్కుల కౌన్సిల్‌లో జరిగిన ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరైంది. ఈ ఓటింగ్‌లో తీర్మానానికి అనుకూలంగా 24 దేశాలు ఓటు వేయగా, వ్యతిరేకంగా 9 దేశాలు ఓటు వేశాయి. 14 దేశాలు గైర్హాజరయ్యాయి. దీంతో తీర్మానం ఆమోదం పొందింది. ఇక చైనా, రష్యా దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. 

‘‘ఐరాస మానవహక్కుల కౌన్సిల్‌ ఈ రోజు మధ్యాహ్నం జరిగిన ఓటింగ్‌లో ఓ తీర్మానాన్ని ఆమోదించింది. పాలస్తీనా భూభాగంలో మానవహక్కుల చట్టాలు అమలు చేసేలా ఈ తీర్మానం జరిగింది. ఇది ఇజ్రాయెల్‌, తూర్పు జెరూసలెంకు కూడా వర్తిస్తుంది’’ అని ఐరాస మానవహక్కుల కౌన్సిల్‌ వెల్లడించింది.  పాలస్తీనా, తూర్పు జెరూసలెంలో మానవహక్కుల పరిస్థితిపై ఈ  సమావేశంలో చర్చించారు. 

దీనిపై ఐరాసలో భారత శాశ్వత రాయబారి  మణిపాండే మాట్లాడుతూ ‘‘ఈ  వివాదంలో అన్ని పక్షాలు హింస, ఘర్షణలు పెరగకుండా సహనం వహించాలి. ప్రస్తుతం తూర్పు జెరూసలెం సహా అన్ని చోట్ల యథాతథ పరిస్థితి కొనసాగించాలి.  జెరూసలెంలో హింస కొనసాగటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా టెంపుల్‌ మౌంట్‌ వద్ద, షేక్‌జర్రాలో వివాదాలపైనే మా ఆందోళనంతా. గాజాలోని పాలస్తీనా ప్రజలకు మానవీయ సాయం అందించాలని కోరుతున్నాం’’ అని పేర్కొన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని