Vaccination: టీకా రికార్డు.. సాయంత్రానికి 2కోట్లు దాటిన డోసుల పంపిణీ

తాజా వార్తలు

Updated : 17/09/2021 17:19 IST

Vaccination: టీకా రికార్డు.. సాయంత్రానికి 2కోట్లు దాటిన డోసుల పంపిణీ

దిల్లీ: టీకా పంపిణీలో భారత్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 9 గంటల్లోనే 2 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా శుక్రవారం భారీఎత్తున కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేపట్టాలని భాజపా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అర్హులైన ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలని, అదే మోదీకి ఇచ్చే అసలైన కానుక అవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నేడు టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ఉదయం నుంచి పెద్ద ఎత్తున డోసులను పంపిణీ చేస్తుండగా.. ఇప్పటికే 2 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఇంకా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది.

సాయంత్రం 5.10 గంటల సమయానికి డోసుల పంపిణీ 2కోట్లు దాటింది. రాత్రి వరకు 2.5కోట్ల డోసులను పంపిణీ చేయొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా.. ఒక రోజులో రెండు కోట్లకు పైగా టీకాలను పంపిణీ చేయడంతో భారత్‌ వ్యాక్సినేషన్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 9 గంటల్లోపే 2 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేయడం విశేషం. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 79కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. వచ్చే నెల నాటికి 100కోట్ల డోసులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.




Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని